Admissions: ఐదవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానం
Sakshi Education
జోగిపేట(అందోల్)/ జహీరాబాద్ టౌన్: 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలలో ఐదవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును జనవరి 20 వరకు పొడిగించినట్లు ప్రాంతీయ పర్యవేక్షకులు ఎం.భీమయ్య జనవరి 17న ఒక ప్రకటనలో తెలిపారు.
tgcet.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 11న రాత పరీక్ష నిర్వహించి మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. వివరాలకు 180042545678 టోల్ ఫ్రీ నంబర్ లో సంప్రదించాలని సూచించారు. అలాగే తెలంగాణ సాంఘిక సంక్షేమ ప్రతిభ కళాశాలలో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
చదవండి: Admissions: విద్యార్థుల భవిష్యత్తుకు నవోదయం.. పరీక్ష విధానం ఇదీ..
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామాలలో 1.50 లక్షలు, పట్టణాలలో రూ.2 లక్షలు ఉన్నవారు అర్హులని తెలి పారు. ఆన్‌లైన్‌లో tswreis.ac.in లో దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 4న ఉదయం 10 గంటలకు ఎంపిక చేసిన కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. హాల్‌టికెట్లు ఈనెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 3 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
Published date : 19 Jan 2024 01:26PM