10th Class Exams: పదో తరగతి పరీక్షలకు అదనపు బస్సులు.. ఉచిత ప్రయాణ సదుపాయం

పరీక్షలు జరగనున్న సమయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకొనేలా, తిరిగి పరీక్షల అనంతరం ఇళ్లకు వెళ్లేందుకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. అమ్మాయిలకు యథావిధిగా మహాలక్ష్మి పథకంలో భాగంగా సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందన్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
నెలవారీ బస్ పాస్లు ఉన్న విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఉచితంగా రాకపోకలు సాగించవచ్చని ఆయన సూచించారు. బస్సులో ప్రయా ణించే సమయంలో హాల్ టికెట్ తో పాటు బస్పాస్ ను కండక్టర్ కు చూపించాలన్నారు. బస్సుల నిర్వహణ, రాకపోకల సచారం కోసం 99592 26160, 99592 26154లను సంప్రదించవచ్చని వెంకటేశ్వర్లు సూచించారు.