TS DSC 2023 Notification : మినీ డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ ఇవాల్సిందే.. ఇంకా టీచర్ పోస్టులను..
కానీ.. ఆ ఆనందం నిరుద్యోగుల్లో ఎక్కువ సేపు నిలవలేదు. వేలల్లో అభ్యర్థులు ఉండగా.. ప్రభుత్వం మాత్రం చాలా తక్కువ సంఖ్యలో పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడమే ఇందుకు కారణం. దీంతో పోస్టులు పెంచాలని.. అలాగే, టీఆర్టీ దరఖాస్తు ఫీజును తగ్గించాలని ఆందోళన బాట పట్టారు.
☛ TRT Syllabus Change : మారిన టీఆర్టీ సిలబస్.. ఇకపై ఇవి చదవాల్సిందే..
మినీ డీఎస్సీ వద్దు, మెగా డీఎస్సీ వేయాలి.. అంటూ..
దీనిపై సెప్టెంబర్ 21వ తేదీన (గురువారం) మహబూబ్‌నగర్‌లో అభ్యర్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి ‘మినీ డీఎస్సీ వద్దు, మెగా డీఎస్సీ వేయాలి’ అని నినదించారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో బైఠాయించి నిరసన చేపట్టారు. ఏబీవీపీతో పాటు పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఉమ్మడి జిల్లాలో టెట్‌కు రెండు పేపర్లు కలిపి దరఖాస్తులు చేసుకున్న వారు 80 వేలకు పైగా ఉండడంతో ఒక్కో పోస్టుకు 140 నుంచి 150 మధ్య పోటీ ఉండే అవకాశం ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
☛ ఇవి పాటిస్తే.. టీచర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips
13 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయాల్సిందే..
ఉమ్మడి జిల్లాలో పోస్టులు 586 ఉండి జిల్లాల వారీగా తక్కువ పోస్టులు ఉన్నాయి. పోస్టులు సబ్జెక్టులు, కేటగిరీలు, కేడర్‌ల వారీగా చూస్తే ఒక్కో పోస్టు కూడా ఉండడం లేదని పలువురు అభ్యర్థులు పేర్కొంటున్నారు. రిజర్వేషన్ టేబుల్‌లో పోస్టుల సంఖ్య కంటే సున్నాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎన్నో ఏళ్లుగా డీఎస్సీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి అన్ని వదులుకుని టీఆర్టీకి సిద్ధమవుతున్నామని, కానీ ప్రభుత్వం చాలీచాలని పోస్టులు ఇవ్వడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంటనే పోస్టులు పెంచాలన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు ఏ పరీక్షకు లేని విధంగా ఫీజులు ఏకంగా రూ.వెయ్యి పెట్టారని, నిరుద్యోగులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని ఫీజులు వెంటనే రూ.200లకు తగ్గించాలని డిమాండ్ చేశారు.
చదవండి: TS TET/TRT/DSC Previous Papers
మహబూబ్‌నగర్‌లో 415 పోస్టులు, నాగర్‌కర్నూల్‌లో 450, నారాయణపేటలో అత్యధికంగా 470 పోస్టులు ఉన్నాయి. ఇక గద్వాల, వనపర్తిలో 316 పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఇలా వీటిలో 30శాతం పోస్టులు ప్రమోషన్‌లకు వదిలేసినా.. ఉమ్మడి జిల్లాలో దాదాపు 1400 పోస్టులు నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయడమే తక్కువ భర్తీ చేస్తున్నట్లు పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: సెకండరీ గ్రేడ్ టీచర్ బిట్ బ్యాంక్
తక్కువ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే.. : మేఘమాల, టీఆర్టీ అభ్యర్థి
వాస్తవంగా బడుల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే పోస్టుల సంఖ్య పెరుగుతుంది. కానీ తక్కువ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే వీటిలో ఒక్కో పోస్టుకు వందల సంఖ్యలో పోటీ పడాల్సి వస్తోంది. కేటగిరిలు, సబ్జెక్టు వారీగా చూస్తే కొన్ని సున్నా పోస్టులు ఉన్నాయి. ఎంతో ఖర్చులు భర్తిస్తూ చదువుతున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే పోస్టులను పెంచాలి.
☛ TET/DSC 2023: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..
పరీక్ష ఫీజు కూడా.. : కేశవులు, టీఆర్టీ అభ్యర్థి
ప్రభుత్వం ప్రస్తుతం తక్కువ పోస్టులతో మినీ డీఎస్సీ వేసింది. అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పోస్టుల సంఖ్య పెంచి మెగా డీఎస్సీని నిర్వహించాలి. ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు రూ.లక్షల్లో ఖర్చులు భరించి చదువుతున్నాం. ప్రభుత్వం స్పందించి పోస్టులు పెంచాలి. అలాగే పరీక్ష ఫీజు కూడా రూ.200కి తగ్గించాలి.
Tags
- TS Mega DSC 2023
- TS DSC 2023
- TS TRT 2023 Issue
- ts teacher jobs issue 2023
- ts teacher jobs issue news in telugu
- ts teacher jobs 2023
- ts teacher jobs news
- Mega DSC Notification 2023 News
- Mega DSC 2023
- teacher recruitment test telangana
- teacher recruitment test telangana news in telugu
- Government of Telangana Recruitment
- sakshi education jobs notification