Young Women Achieves SI Post: కృషితో సాధన చేసి లక్ష్యాన్ని సాధించింది
పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకుంది ఓ గిరిజన యువతి. మండలంలోని భద్రాల్ తండాకు చెందిన పవార్ శ్రావణ్, బుచ్చిబాయి దంపతులకు నలుగురు కూతుళ్లు. శ్రావణ్ బాన్సువాడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పెద్ద కూతురు పవార్ శిరీష ఇటీవల నిర్వహించిన పొలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) రాత పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 17వ ర్యాంకు సాధించింది. దీంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Young Student Success: బీటెక్ చేసి ఎస్ఐగా ఉద్యోగం
శిరీష 2016లో బిచ్కుంద వీవీఎన్ స్కూల్‌లో పదో తరగతి చదివి, 9.8 గ్రేడ్ పాయింట్లతో మండల టాపర్‌గా నిలిచింది. 2016–18లో బోధన్‌లోని ఉషోదయ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివిన శిరీష.. 978 మార్కులతో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో 2021లో డిగ్రీ పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ఎస్సై పరీక్ష కోసం ఏడాది పాటు కోచింగ్ తీసుకుంది. ఎస్సై పరీక్షలో జనరల్ కేటగిరిలో రాష్ట్రస్థాయిలో 17వ ర్యాంకు సాధించి కల నెరవేర్చుకుంది. తన కూతురు కుటుంబానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని ఆమె తండ్రి శ్రావణ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Students with SI Goals: వివిధ చదువులతో ఒకే లక్ష్యానికి చేరిన యువతీయువకులు
ఉద్యోగం సాధించాలని..
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కనేదాన్ని. గట్టి సంకల్పంతో కష్టపడి చదివా. చిన్నప్పటినుంచి మంచి ర్యాంకులు సాధించా. ఎస్సై పరీక్షలోనూ ఉత్తమ ప్రతిభ చూపి ఉద్యోగానికి ఎంపికయ్యా. ఆనందంగా ఉంది. తల్లిదండ్రులే నా హీరోలు.. వారి ప్రోత్సాహంతో ఐపీఎస్ లక్ష్యంగా ముందుకు సాగుతా.
– శిరీష, ఎస్సైగా ఎంపికై న అభ్యర్థి