Skip to main content

First Attempt Success: ఎస్ఐ కొలువును సాధించిన యువ‌తి

త‌న చ‌దువును పూర్తి చేసిన ఈ యువ‌తి శ్రావ‌ణి, త‌న పీజీ స‌మ‌యంలోనే సివిల్స్ నోటిఫికేష‌న్ రావ‌డంతో ఆ ప‌రీక్ష‌లో పాల్గొని విజయం పొందింది. త‌న ప్ర‌యాణాన్ని ప‌రిశీలిద్దాం..
Civil SI achiever Shravani with her parents
Civil SI achiever Shravani with her parents

సాక్షి ఎడ్యుకేష‌న్: ఇటిక్యాల గ్రామానికి చెందిన సామల్ల రమేశ్‌, రాజగంగుల చిన్నకూతురు శ్రావణి తొలిప్రయత్నంలోనే సివిల్‌ ఎస్సైగా ఎంపికయ్యారు. ఆమె తండ్రి రమేశ్‌ స్వగ్రామంలో చికెన్‌ సెంటర్‌ నడపుతున్నారు. తల్లి బీడీ కార్మికురాలు. శ్రావణి ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఇటిక్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివారు. ఐదు నుంచి పదో తరగతి వరకు తాటిపల్లి గురుకులం, కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌, హైదరాబాద్‌ కోఠీ ఉమెన్స్‌ కళాశాలలో డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో పీజీ స్టాటిస్టిక్స్‌ చదువుతున్నారు.

Success in SI Selection: త‌న ప్ర‌య‌త్న‌మే త‌న విజ‌యానికి కార‌ణం

పీజీ చదువుతున్న సమయంలోనే నోటిఫికేషన్‌ వెలువడగా, తొలిప్రయత్నంలోనే ప్రిలిమ్స్‌లో ఎంపికయ్యారు. రోజూ 8 గంటల పాటు చదవడంతో ఎస్సై కొలువ సాధ్యమైందని శ్రావణి తెలిపారు. ఆమెను గ్రామస్తులు అభినందించారు.

Published date : 25 Sep 2023 11:56AM

Photo Stories