Skip to main content

Teacher Recruitmenit Test(TRT) : టీఆర్‌టీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పోస్టుల భ‌ర్తీ ఇలా..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పీజీటీ, టీజీటీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

176 పీజీటీ, టీజీటీ 31 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం ఈ టీఆర్‌టీ ద్వారా 207 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టులకు https://cse.ap.gov.in/DSE ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ టీచర్‌ పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 23 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం కంప్యూటరాధారితంగా జరుగుతాయి. ఇందులో మెరిట్, రిజర్వేషన్లు, ఇతర నిబంధనల ప్రకారం ఆయా పోస్టులను భర్తీ చేస్తారు.

డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

టెట్‌ మార్కులకు..
టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు, ఇతర నిబంధనలను అనుసరించి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జనరల్‌ మహిళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు.

ముఖ్య‌మైన తేదీలు ఇవే..:

నోటిఫికేషన్‌ విడుదల

ఆగస్టు 22

పేమెంట్‌గేట్‌వే ద్వారా

ఆగస్టు 24 నుంచి

ఫీజు చెల్లింపు

సెప్టెంబర్‌ 17 వరకు

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ

ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్‌ 18 వరకు

హెల్ప్‌ డెస్కుల అందుబాటు

ఆగస్టు 22 నుంచి

మాక్‌ టెస్టు అందుబాటు

అక్టోబర్‌ 17 నుంచి 

హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌

అక్టోబర్‌ 6 నుంచి

పరీక్ష తేదీలు

అక్టోబర్‌ 23 నుంచి

ప్రాథమిక కీ విడుదల

అక్టోబర్‌ 28

అభ్యంతరాల స్వీకరణ

అక్టోబర్‌ 28 నుంచి 31 వరకు

తుది కీ విడుదల

నవంబర్‌ 2

తుది ఫలితాలు విడుదల

నవంబర్‌ 4

ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

Published date : 24 Aug 2022 07:30PM
PDF

Photo Stories