Skip to main content

వాతావరణం - జలావరణం - వాతావరణ పొరలు

1. వాతావరణం అంటే?
జ. భూగోళం చుట్టూ ఆవరించి ఉన్న వాయుపొర

2. వాతావరణాన్ని ఏ విధంగా విభజించారు?
జ. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ఐనో ఆవరణం

3. వాతావరణంలో ఎక్కువ సాంద్రత కలిగిన పొర?
జ. ట్రోపో ఆవరణం

4. ట్రోపో ఆవరణ మందం భూమి ఉపరితలం నుంచి?
జ. 8 నుంచి 18 కి.మీ. ఎత్తు వరకు

5. ట్రోపో ఆవరణం మందం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది?
జ. భూమధ్యరేఖా ప్రాంతం

6. వాతావరణంలో జరిగే అనేక రకాల మార్పులన్నీ ఏ ఆవరణంలో జరుగుతాయి?
జ. ట్రోపో ఆవరణం

7. పగలు సూర్యతాపం నుంచి, రాత్రి భూమి ఉపరితలంపై తగిన వేడిని నిలిపి జీవరాసులని రక్షిస్తున్న పొర?
జ. ట్రోపో ఆవరణం

8. మేఘాలు, అవపాతం ఏ పొరలో ఏర్పడుతున్నాయి?
జ. ట్రోపో ఆవరణం

9. ట్రోపో ఆవరణానికి, ఐనో ఆవరణానికి మధ్య ఉండే పొర?
జ. స్ట్రాటో ఆవరణం

10. స్ట్రాటో ఆవరణం ఎంత ఎత్తు వరకు ఉంటుంది?
జ. 80 కి.మీ.

11. స్ట్రాటో ఆవరణం ప్రత్యేకత?
జ. విమానాలు ఈ పొరలోనే ప్రయాణం చేస్తాయి

12. వాతావరణంలో అన్నిటికన్నా పైన ఉండే పొర?
జ. ఐనో ఆవరణం

13. ఐనో ఆవరణం ఎంత ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది?
జ. 1050 కి.మీ.

14. రేడియో తరంగాలను భూమిపైకి పరావర్తనం చేసే పొర?
జ. ఐనో ఆవరణం
Published date : 07 Jul 2012 02:29PM

Photo Stories