Skip to main content

భూఅంతర్భాగం

1. భూవ్యాసార్థం (భూఉపరితలం నుంచి నాభి వరకు ఉన్న దూరం) ఎంత?
జ. 6,440 కి.మీ.

2. మానవుడు తవ్వకాల ద్వారా భూమి లోపలికి ఎంత లోతు వరకు స్వయంగా చేరగలిగాడు?
జ. 3 కి.మీ.

3. చమురు తవ్వకాల కోసం ఎంత లోతు వరకు గొట్టాలను పంపించగలిగాడు?
జ. 6 1/2 కి.మీ.

4. భూ ఉపరితలం నుంచి లోతుకు పోయే కొద్ది ఉష్ణోగ్రత ఏమవుతుంది?
జ. ప్రతి 32 కి.మీ.కు 1°C ఉష్ణోగ్రత పెరుగుతుంది

5. భూనాభి వద్ద ఎంత ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా?
జ. 6000°C

6. భూనాభి వద్ద శిలాద్రవం ఏ రూపంలో ఉంటుంది?
జ. ఘనరూపంలో ఉండే మెత్తటి ముద్దలా

7. భూ పటల మందం
జ. 60 కి.మీ.

8. సిలికా, అల్యూమినియం, ఆక్సిజన్, మెగ్నీషియం మొదలైన వాటి మిశ్రమంతో కలసి ఉన్న భూమి లోపలి పొర?
జ. భూపటలం

9. భూప్రావారం మందం
జ. 2840 కి.మీ.

10. భూప్రావారం రసాయన సమ్మేళనం?
జ. సిలికా, ఇతర లోహాలు

11. భూకేంద్ర మండలం మందం?
జ. 3500 కి.మీ.

12. భూకేంద్ర మండలం రసాయన సమ్మేళనం?
జ. నికెల్, ఇనుము

13. భూఅంతర్భాగాన్ని సియాల్, సిమా, నిఫెగా విభజించింది?
జ. సుయెస్

14. సియాల్ (Sial) రసాయన సమ్మేళనం?
జ. సిలికా, అల్యూమినియం

15. నిఫె (Nife) రసాయన సమ్మేళనం?
జ. నికెల్, ఇనుము

16. సిమా (Sima) రసాయన సమ్మేళనం?
జ. సిలికా, మెగ్నీషియం
Published date : 07 Jul 2012 02:29PM

Photo Stories