మన విశ్వం
నక్షత్ర వీధుల్లో చిన్న, చిన్న గుంపుల్లో ఉన్న నక్షత్ర సముదాయాలను తారాగణం లేదా నక్షత్రరాశి అంటారు.
నక్షత్రరాశుల్లో కొన్నింటిని ఉత్తరార్థగోళం నుంచి చూడగలిగితే, మరికొన్నింటిని దక్షిణార్థ గోళం నుంచి మాత్రమే చూడగలం. ఇప్పటివరకు మొత్తం 88 నక్షత్ర రాశులను శాస్త్రజ్ఞులు అధ్యయనం చేశారు.
సూర్యుడు తిరిగే దారిని సంవత్సర కాలం మొత్తం 12 భాగాలుగా విభజించి, వాటి ఆకారాలను బట్టి నక్షత్ర సముదాయాలను 12 పేర్లతో పిలుస్తున్నారు. ఈ పన్నెండు రాశులను కలిపి రాశిచక్రం అంటారు.
జ్యోతిష్య శాస్త్రజ్ఞులు ఈ రాశుల తేదీలను బట్టి కాలాలను, రుతువులను, పంచాగాలను గుణిస్తారు.
రాకెట్లు రెండు రకాలు అవి..
1. యుద్ద రాకెట్లు
2. రోదసీ రాకెట్లు.
కృత్రిమ ఉపగ్రహం భూమ్యాకర్షణ శక్తిని అధిగమించి నిర్దిష్ట కక్ష్యలో ప్రవేశించేందుకు సెకనుకు 11.2 కి.మీల. వేగం అవసరం.
కృత్రిమ ఉపగ్రహాలు భూమికి ఉపగ్రహాలుగా పనిచేస్తే, స్పేస్ ప్రోబ్స్ అనేవి ఇతర గ్రహాలను శోధించేందుకు తోడ్పడతాయి.
ప్రప్రథమంగా రష్యా.. 1957, అక్టోబర్ 4న మానవుడు లేని స్పుత్నిక్-1 అనే అంతరిక్ష నౌకను రోదసీలోకి పంపింది.
1961, ఏప్రిల్ 12న రష్యాకు చెందిన కల్నల్ యూరీ గగారిన్.. వస్తోక్ అనే అంతరిక్ష నౌక ద్వారా 83.34 ని॥మొట్టమొదటిసారిగా భూ ప్రదక్షిణం చేశాడు.
1963లో వస్తోక్-6 అనే అంతరిక్ష నౌకలో రష్యా మహిళ లెఫ్టినెంట్ కల్నల్ వాలెంటీనా టెరిస్కోవా అంతరిక్ష యానం చేసింది.
1969, జూలై 21న అమెరికాకు చెందిన అపోలో-11 అనే అంతరిక్ష నౌక ద్వారా నీల్ ఆర్‌మస్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్‌లు ప్రప్రథమంగా చంద్రుడిపై కాలుమోపారు.
1984, ఏప్రిల్ 3న భారతదేశానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ రాకేష్‌శర్మ.. సోయూజ్-టి-11 అనే రోదసీ నౌక ద్వారా అంతరిక్షయానం చేశాడు.
భారతదేశం కూడా రోదసీ పరిశోధనల్లో ఎంతో ప్రగతిని సాధించింది. ఆర్యభట్ట, భాస్కర 1, 2, రోహిణి, ఐఆర్‌ఎస్, ఇన్‌శాట్ - 1ఎ, 1బి, 1సి, 1డి, 2ఎ, 2బి; పీఎస్‌ఎల్‌వీ - డి2 మొదలైన ఉపగ్రహాలను ప్రయోగించింది.
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీహరికోట వద్ద రాకెట్ లాంచింగ్ స్టేషన్ (షార్) ఉంది.
మన విశ్వం వేలకొద్దీ గెలాక్సీలను కలిగి ఉంది. ప్రతి గెలాక్సీలోనూ మిలియన్‌ల నక్షత్రాలున్నాయి.
నక్షత్రాలకు వాటి చుట్టూ తిరిగే గ్రహ కూటములున్నాయి.
గ్రహాలకు వాటి చుట్టూ తిరుగుతూ ఉండే ఉపగ్రహాలుంటాయి. అందువల్ల మన విశ్వం చాలా విశాలమైంది.
సూర్యుడు పాలపుంత అనే గెలాక్సీకి చెందిన ఒక సామాన్య నక్షత్రం. సూర్యుడు, గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్‌స అన్నింటినీ కలిపి సూర్య కుటుంబం అంటారు.
గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ వివిధ దీర్ఘ వృత్తాకార మార్గాల్లో తిరుగుతున్నాయి.
భూమి సహజ ఉపగ్రహం చంద్రుడు.
భూమి సూర్యుడి చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి ఒక సంవత్సరం పడుతుంది. అంటే 365 1/4 రోజులు. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది.
సూర్యుడికి, భూమికి మధ్య దూరాన్ని ఖగోళ ప్రమాణం అంటారు.
1AU = 1.496×1011మీ॥
కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యం లో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు.
ఒక కాంతి సంవత్సరం = 9.3×1015 మీ॥= 6.33×104 AU
పార్‌సెక్ అనేది దూరం ప్రమాణాలన్నింటిలోనూ పెద్దది. ఇది 3.26 కాంతి సంవత్సరాలకు సమానం.
బుధ గ్రహం పరిభ్రమణ కాలం - 88 రోజులు.
అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ప్లూటో (248 సం॥
గ్రహాలన్నింటిలో పెద్ద గ్రహం - గురుడు (బృహస్పతి)
గ్రహాలన్నింటిలో చిన్న గ్రహం - బుధుడు.
సూర్యుడి నుంచి కనిష్ట దూరంలో బుధుడు, గరిష్ట దూరంలో ప్లూటో ఉన్నాయి.
అత్యధిక ఉపగ్రహాలు ఉన్న గ్రహం-శని (30)
ఉపగ్రహాలు లేని గ్రహాలు - బుధుడు, శుక్రుడు.
భూమి మీద మినహా మిగతా గ్రహాలపై ప్రాణులు ఉండటానికి అనుకూల వాతావరణ పరిస్థితులు లేవు.
బుధ గ్రహం సూర్యుడికి అతి సమీపంలో ఉండటం వల్ల దాని మీద పగలు అతి వేడిగా, రాత్రి అతి చల్లగా ఉంటుంది.
శుక్ర గ్రహం అతి దట్టమైన మేఘాలతో కప్పి ఉండటం వల్ల సూర్యకాంతి దాని తలాన్ని చేరలేదు.
శని గ్రహం కిలోమీటర్ల మందం ఉన్న మంచు పొరలతో కప్పి ఉండటం వల్ల అతి చల్లగా ఉంటుంది. కాబట్టి ప్రాణులుండేందుకు అవకాశం లేదు.
కుజ గ్రహం మాత్రం ఆక్సిజన్, నీటి ఆవిరిలతో కూడిన వాతావరణం కలిగి ఉంది. దాని ఉష్ణోగ్రత 250 సెంటీగ్రేడ్ నుంచి 400 సెంటీగ్రేడ్‌కి మధ్యలో ఉంటుంది.
ధ్రువ నక్షత్రాన్ని ఆంగ్లంలో పోలారిస్ అంటారు. ఇది భూమి ఉత్తర ధ్రువానికి ఎదురుగా ఉంది.
ధ్రువ నక్షత్ర స్థానాన్ని సప్తర్షి మండలం సహాయంతో తెలుసుకోవచ్చు.
సప్తర్షి మండలాన్ని ఇంగ్లిష్‌లో గ్రేట్‌బేర్ అంటారు.
గ్రేట్‌బేర్ అనేది నాగలి లేదా గాలిపటం ఆకారంలో ఉంటుంది.
సూర్యుడు తన చుట్టూ తాను ఒకసారి తిరిగి రావడానికి 25 రోజులు పడుతుంది.
లీప్ సంవత్సరంలో 366 రోజులుంటాయి. ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి.
సూర్యుడి తర్వాత భూమికి అత్యంత సమీపంలోని నక్షత్రం- ప్రాక్సిమాసెంటౌరి
హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది.
రాశులన్నింటిలో పెద్ద తారాగణం - హైడ్రా
చంద్రుడిపై వస్తువుల బరువు భూమిపై బరువులో ఆరో వంతు ఉంటుంది.
మాదిరి ప్రశ్నలు
1. భారతదేశం మొదటగా భూకక్ష్యలోకి ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం?
1) ఆర్యభట్ట
2) భాస్కర-1
3) ఇన్‌శాట్ - 1బి
4) భాస్కర - 2
2. అన్నింటికంటే ప్రకాశంగా కనిపించే గ్రహం?
1) శని
2) భూమి
3) శుక్రుడు
4) బుధుడు
3. పగలు, రాత్రి ఏర్పడడానికి కారణం?
1) భూ పరిభ్రమణం
2) భూ భ్రమణం
3) ఉల్కాపాతం
4) ఏదీకాదు
4. సూర్య గ్రహణం ఏ సందర్భంలో ఏర్పడుతుంది?
1) భూమి.. చంద్రుడికి, సూర్యుడికి మధ్య వచ్చినప్పుడు
2) చంద్రుడు.. భూమికి, సూర్యుడికి మధ్య వచ్చినప్పుడు
3) సూర్యుడు భూమి, చంద్రుడి మధ్య వచ్చినప్పుడు
4) అన్నీ
5. రాశుల్లో అన్నింటికంటే పెద్ద తారాగణం?
1) సెరస్
2) ఇంకారస్
3) హైడ్రా
4) హేలీ
6. రష్యా సహకారంతో భారతదేశంలో రాకెట్ లాంచింగ్ స్టేషన్‌లు ఏర్పర్చిన ప్రదేశాలు?
1) తుంబా
2) శ్రీహరికోట
3) ఢిల్లీ
4) 1, 2
7. అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం?
1) శని
2) బృహస్పతి
3) బుధుడు
4) శుక్రుడు
8. ఇప్పటివరకు గుర్తించిన నక్షత్రాల్లో అతిపెద్దది?
1) సెరస్
2) ఎప్సిలాన్ అరిగ
3) హైడ్రా
4) ఇంకారస్
9. మొట్టమొదటి స్పేస్ షటిల్?
1) అపోలో
2) స్పుత్నిక్
3) కొలంబియా
4) వస్తోక్
10. స్కైలాబ్ అనే ప్రయోగాత్మక అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని ఏ దేశం ఏర్పాటు చేసింది?
1) రష్యా
2) అమెరికా
3) ఇండియా
4) సింగపూర్
సమాధానాలు
1) 1 | 2) 3 | 3) 2 | 4) 2 | 5) 3 | 6) 4 | 7) 1 | 8) 2 | 9) 3 | 10) 2 |
1. చంద్రుడు తన చుట్టూ తాను, అలాగే భూమి చుట్టూ తిరగడానికి పట్టే రోజులు? (డీఎస్సీ-2000)
1) 30 రోజులు
2) 29 1/2 రోజులు
3) 92 1/2 రోజులు
4) 29 రోజులు
2. ధ్రువ నక్షత్రం నావికులకు దేన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది? (డీఎస్సీ - 2000)
1) గెలాక్సీ
2) గాలి
3) దిక్కు
4) వాతావరణం
3. ఒక కాంతి సంవత్సరం (కి.మీ.లలో)? (డీఎస్సీ-2001)
1) 3 ×104 × 60 × 60 ×24 × 365.25
2) 3 × 102 × 60 × 60 × 24 × 365.25
3) 3 × 105 × 60 × 60 × 24 × 365.25
4) 3 ×103 × 60 × 60 × 24 × 365.25
4. నక్షత్రాలు కాంతిని నలుదిశలకు వెదజల్లా లంటే వాటిలో ఉండాల్సిన ఉష్ణోగ్రత? (డీఎస్సీ-2002)
1) 10 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్
2) 5 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్
3) 5 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్
4) 10 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్
5. 1994లో విజయవంతంగా ప్రయోగించిన భారతీయ ఉపగ్రహ నౌక? (డీఎస్సీ-2002)
1) ఇన్‌శాట్-1బి
2) పీఎస్‌ఎల్‌వీడీ-2
3) భాస్కర-2
4) ఆర్యభట్ట
6. సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న సగటు దూరం?
1) 149,000,000 కి.మీ.
2) 149,598,500 కి.మీ.
3) 149,593,300 కి.మీ
4) 149,895,500 కి.మీ.
7. ఏ అంతరిక్ష నౌకల ద్వారా అంగారక గ్రహంపై జీవరాశి లేదని నిరూపించారు? (డీఎస్సీ-2003)
1) స్కాటర్‌న - 5, స్కాటర్‌న - 6
2) అపోలో - 11, సోయూజ్-టీ-11
3) వైకింగ్-1, వైకింగ్-2
4) సోయూజ్ -టీ-11, శాల్యూట్
8. బుధ గ్రహం పరిభ్రమణ కాలం? (డీఎస్సీ-2006)
1) 88 రోజులు
2) 248 రోజులు
3) 365 రోజులు
4) 243 రోజులు
9. స్క్వాడ్రన్ లీడర్ రాకేశ్ శర్మ అంతరిక్ష యానం చేసిన రోజు? (డీఎస్సీ-2006)
1) 3-6-1984
2) 3-4-1984
3) 3-4-1985
4) 3-6-1985
10. భూమధ్య రేఖ వద్ద భూమి వ్యాసం కి.మీ.లలో? (డీఎస్సీ - 2008)
1) 12,576
2) 12,657
3) 12,756
4) 12,765
11. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే గ్రహాల్లో ద్రవ్యరాశిలో రెండో స్థానంలో ఉన్న గ్రహం, ఆత్మభ్రమణ కాలం అన్నింటి కంటే ఎక్కువ ఉన్న గ్రహం వరుసగా? (డీఎస్సీ - 2008)
1) బృహస్పతి, భూమి
2) బుధుడు, అంగారకుడు
3) శని, శుక్రుడు
4) నెప్ట్యూన్, యురేనస్
12. స్పేస్ ప్రోబ్‌కు ఉదాహరణ? (డీఎస్సీ-2008)
1) పయనీర్
2) ఆర్యభట్ట
3) భాస్కర - 2
4) అట్లాంటిస్
13. ఏ గ్రహం మీద ఆక్సిజన్, నీటి ఆవిరితో కూడిన వాతావరణం ఉంది? (డీఎస్సీ-2012)
1) కుజుడు
2) బుధుడు
3) బృహస్పతి
4) యురేనస్
సమాధానాలు
1) 2 | 2) 3 | 3) 4 | 4) 4 | 5) 2 | 6) 2 | 7) 3 | 8) 1 | 9) 2 | 10) 3 |
11) 3 | 12) 1 | 13) 1 |