Skip to main content

పంజాబ్ విద్యార్థులకు ఉచితంగా ఫోన్లు

చండీగఢ్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను అందజేసే పథకాన్ని పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించింది.
2017 ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లకు ఎన్నికల హామీ అమలుకు పూనుకుంది. బుధవారం ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ‘పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీం’ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద మొదటి దశలో నవంబర్‌కల్లా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 26 ప్రాంతాల్లో 1,74,015 మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేయనున్నారు.
Published date : 13 Aug 2020 03:18PM

Photo Stories