పాలిసెట్-2020 పరీక్ష
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి బుధవారం జరగనున్న పాలిసెట్-20 పరీక్షకు తెలంగాణ సాంకేతిక విద్యా మండలి ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 73,918 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 285 పరీక్షా కేంద్రాలు, 50 సమన్వయ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని బోర్డు కార్యదర్శి సి.శ్రీనాథ్ తెలిపారు.
Published date : 02 Sep 2020 12:22PM