నైపుణ్యాలు పెంచేందుకు వెబ్‌సైట్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు పెంచేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
కరోనా నేపథ్యంలో విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా ఉద్యోగ నైపుణ్యాలు మెరుగుపరచుకునేలా వివిధ పారిశ్రామిక వర్గాల భాగస్వామ్యంతో పలు ఆన్‌లైన్ పాఠాలను రూపొందించింది. నేషనల్ ఎడ్యుకేషనల్ అలయెన్స్ ఫర్ టెక్నాలజీ (నీట్) పేరుతో ఈ పాఠాలను రూపొందించి, వాటిని వెబ్‌సైట్‌లో (https://neat.aicte-india.org) అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులు ఇళ్లలో ఉండే తమ వెబ్‌సైట్ ద్వారా ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని ఏఐసీటీఈ వివరించింది.
Published date : 04 Apr 2020 12:56PM