ఖమ్మం ఐటీ హబ్ ప్రారంభం: ఇక హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా ఐటీ సేవలు..
Sakshi Education
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌లను విసృ్తతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో భాగంగా ఖమ్మం ఐటీ హబ్‌ను అన్ని హంగులతో నిర్మించి హైదరాబాద్, బెంగళూరు నగరాలకు దీటుగా ఐటీ సేవలు అందించనున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తెలిపారు.
ఖమ్మంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ఐటీ హబ్‌కు ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు రావడంతో ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే వాటికి మేడిన్ ఖమ్మంగా పేరొచ్చే అవకాశం కనుచూపు మేరల్లోనే ఉందన్నారు. సర్వీసు కంపెనీలకన్నా ఐటీ రంగంలో ప్రోడక్ట్ కంపెనీలు ఖమ్మం వైపు దృష్టి సారించడంతో ఇది సాధ్యం కానుందన్నారు. ఐటీ హబ్ రెండో దశ తక్షణ నిర్మాణం కోసం రూ. 20 కోట్లను మంజూరు చేస్తున్నామని, తద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం కలుగుతుందన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్‌జ సెంటర్ (టాస్క్) ఆధ్వర్యంలో నిరంతరం వృత్తి నైపుణ్య శిక్షణ కొనసాగాలని, దీంతో ఉద్యో గావకాశాలు ఏ రూపంలో ఉన్నా ఖమ్మం యువత అందిపుచ్చుకొనే అవకాశం ఉందన్నారు.
అభివృద్ధిలో ఖమ్మం దూసుకెళ్తోంది: అభివృద్ధిలో ఖమ్మం దూసుకుపోతోందని, నగరాన్ని ఎలా సుందరీకరించుకోవాలో.. ప్రభుత్వం నుంచి నిధులు ఎలా రాబట్టుకోవాలో మంత్రి అజయ్ నుంచి తెలుసుకొని ప్రజాప్రతినిధులు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికంగా ఉన్న వనరులను వినియోగించుకోవడంలో ఖమ్మం ప్రజలు ముందంజలో ఉన్నారని, దీనికి ఉదాహరణే.. ఎన్నెస్పీ కాల్వపై వాకింగ్ ట్రాక్, పలుచోట్ల పార్కుల నిర్మాణమని, వైకుంఠధామాన్ని సైతం అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం మంత్రి పువ్వాడకే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి పోలీస్ కమిషనరేట్‌ను ఖమ్మంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఐటీ రంగం కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా.. ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. ఆయన ఆలోచనల మేరకు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట వంటి ప్రాంతాల్లో ఐటీ హబ్‌లు ఏర్పాటయ్యాయని వివరించారు.

Published date : 08 Dec 2020 04:28PM