Skip to main content

డిసెంబర్ 7 నుంచి డిగ్రీ ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు డిసెంబర్ 7వ తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయని డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు.
ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో 27,365 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ విడతో సీటు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో డిసెంబర్ 8లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, అంతకు ముందు సీటు పొందిన వారు కూడా అదే తేదీలోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా 14,247 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, పాత విద్యార్థులతో కలిపి 28,136 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు తెలిపారు. వెబ్‌ఆప్షన్లు సరిగా ఇవ్వకపోవడంతో 771 మంది విద్యార్థులు సీట్లు కోల్పోయినట్లు వెల్లడించారు. సీటు పొందిన విద్యార్థుల మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుందని తెలిపారు. కాలేజీలో రిపోర్ట్ చేయని విద్యార్థులు సీటు కోల్పోయే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు.
Published date : 07 Dec 2020 04:44PM

Photo Stories