Skip to main content

డేటా సెంటర్ హబ్‌గా తెలంగాణ!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం తమ అనుబంధ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ద్వారా రూ.20,761 కోట్లు పెట్టుబడిగా పెడు తున్నట్లు అమెజాన్ ఇటీవల ప్రకటించింది.
హైదరాబాద్ కేంద్రంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆసియా పసిఫిక్ రీజియన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో స్వతంత్రంగా పనిచేసే మూడు ఎవైలబులిటీ జోన్లు, ఒక్కో ఎవైలబులిటీ జోన్‌లో అనేక డేటా సెంటర్లు ఉంటాయని తెలిపింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే అతిపెద్ద ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఊపందుకుంటున్న ఏర్పాట్లు..
దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ సాఫ్ట్‌వేర్ కంపెనీలు తప్పనిసరిగా డేటా లోకలైజేషన్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలో డేటా సెంటర్ల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో డేటా సెంటర్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో ‘డేటా సెంటర్ పాలసీ’ని విడుదల చేసింది. దేశంలోనే డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రత్యేక పాలసీని కలిగి ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ చోటు సంపాదించుకుంది. డేటా సెంటర్ పాలసీలో భాగంగా పవర్ ఇన్సెంటివ్‌లు, తక్కువ ధరలకే భూమి, ఇంటర్నెట్ చార్జీల చెల్లింపు వంటి ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు డేటా సెంటర్లను అత్యవసర సేవల పరిధిలోకి తెస్తూ విద్యుత్ కోతల నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించింది.

ఐదేళల్లో మూడింతల సామర్థ్యం..
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యం 32 మెగావాట్లు కాగా 2025 నాటికి మూడింతలు అవుతుందని నిపుణులు అం చనా. అంతర్జాతీయ ఐటీ, వాణిజ్య సంస్థల కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉండటంతో డేటా సెంటర్ల రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశముందని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తోంది. డేటా సెంటర్ల సామర్థ్య పరంగా ముంబై ప్రథమ, చెన్నై ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. మెరైన్ కేబుల్ స్టేషన్లు ఇక్కడ ఉండటంతో తొలినాళ్లలో ఇక్కడ డేటా సెంటర్ల రంగంలో పెట్టుబడులు వచ్చాయి.

డేటా సెంటర్ల మార్కెట్‌లో వృద్ధి..
డేటా సెంటర్ల నిర్మాణానికి అయ్యే వ్యయం భారత్‌తో పోలిస్తే అమెరికా, చైనా తదితర దేశాల్లో ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్‌తో పోలిస్తే చైనాలో 10 శాతం, యూఎస్, జపాన్‌లో 50 నుంచి 60 శాతం వరకు నిర్మాణ, నిర్వహణ వ్యయం ఎక్కుగా ఉంది. మరోవైపు డేటా సెంటర్ల మార్కెటింగ్ రంగంలో పెట్టుబడులు మంచి లాభాలను తెస్తుండటంతో తక్కువ పెట్టుబడికి అవకాశమున్న ప్రాంతాలపై పెట్టుబడిదారులు దృష్టి సారించారు. భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి సురక్షితం, నిరం తర విద్యుత్, అత్యుత్తమ మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు హైదరాబాద్ అనువుగా ఉండటంతో ఈ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఫ్లిప్‌కార్ట్ తన రెండో డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోపాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు స్థానికంగా డేటా సెంటర్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాయి. రాబో యే రోజుల్లో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊతం లభించడంతో పాటు, ఐటీ డెవలపర్లు, స్టార్టప్‌ల, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, యాప్ డెవలపర్లు, ఐటీ ఉత్పత్తుల వినియోగదారులకు డేటా సెంటర్ రంగం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Published date : 12 Nov 2020 05:00PM

Photo Stories