‘ఆర్’ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై ఆన్‌లైన్ శిక్షణ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), జీఎన్‌వీ ఐటీ సొల్యూషన్స్ (లెర్నింగ్ సెంటర్ ఆఫ్ 360 డీజీటీఎంజీ) ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు, అధ్యాపకులకు ‘ఆర్’ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పై ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.
స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలిచే ఈ ఆర్ లాంగ్వేజ్‌ను అన్ని డేటా సైన్స్ ఆల్గరిథమ్స్ నిర్వహణలో ఉపయోగిస్తారని చెప్పారు. సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 5 వరకు ఆన్‌లైన్ క్లాసులు జరుగుతాయని, ఇంజనీరింగ్ 3, 4వ ఏడాది చదువుతున్నవారు, పూర్తి చేసిన వారు, అధ్యాపకులు ఈనెల 5లోపు ఠీఠీఠీ.్చఞటటఛీఛి.జీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Published date : 04 Sep 2020 02:25PM