ఐటీలో గణనీయమైన పురోగతి: సీఎస్
Sakshi Education
రాయదుర్గం: ఐటీరంగం, స్టార్టప్ కల్చర్‌లో దేశంలోనే తెలంగాణ గణనీయమైన పురోగతి సాధిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు.
గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో ఏఐసీ-ట్రిపుల్‌ఐటీహైదరాబాద్ ఫౌండేషన్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బుధవారం టీ-సోషల్ స్టార్టప్స్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో టీ-సోషల్ ఇంపాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐసీ-ట్రిపుల్‌ఐటీహెచ్ ఫౌండేషన్‌కు మద్దతు ఇచ్చే నీతి ఆయోగ్, ఏఐఎం మిషన్ డెరైక్టర్ రమణన్ రామనాథన్ ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో వీక్షించి అందర్నీ అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో సోమేశ్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టార్టప్ రంగం మంచి వృద్ధి సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
Published date : 11 Feb 2021 04:13PM