Young Minds, Big Ideas: TEDxలో పలు అంశాలపై మాట్లాడిన శ్రీ చైతన్య విద్యార్థులు
సృజనాత్మక ఆలోచనలకు, భావి తరాల నాయకత్వానికి నిలువుటద్దంగా నిలిచే ప్రపంచ ప్రతిష్టాత్మకమైన టెడ్ ఎక్స్ వేదికపై చిన్నారులు పంచుకున్న ఆలోచనలు, మాటలు అందరినీ విస్మయపరిచాయి. మియాపూర్ లోని శ్రీ చైతన్య ఫ్యూచర్ పాత్ వేస్ క్యాంపస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన TEDx వేదికపై పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభ అందరినీ అలరించింది.
క్యాంపస్ ప్రిన్సిపాల్ భావనా పాఠక్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో 6, 7, 8 తరగతుల విద్యార్థులు తమదైన శైలిలో పలు అంశాలపై మాట్లాడారు. విద్యార్థులు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు మరియు సవాళ్లు, ప్రపంచంలో భారతదేశం యొక్క పాత్ర మరియు ఇతర అంశాల గురించి గొప్ప ఆలోచనలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా భావనా పాఠక్ మాట్లాడుతూ.. అత్యంత ప్రతిష్టాత్మకమైన టెడ్ ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లపై ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని, తొలిసారిగా పాఠశాల స్థాయిలో మాట్లాడడం గర్వకారణమన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. శ్రీ చైతన్య ఫ్యూచర్ పాత్‌వేస్ విద్యార్థులను నేటి పోటీ ప్రపంచానికి సిద్ధం చేస్తుందని పాఠక్ పేర్కొన్నారు.