Skip to main content

10th class Exams timings changed: 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్‌ ప్రీ-ఫైనల్ పరీక్ష టైమింగ్‌లో మార్పులు

Updated timing for  10th class  pre-final exams on Ramzan  10th class Exams timings changed  10 th class  pre-final exams new timing notification
10th class Exams timings changed

రంజాన్ సందర్భంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పదోతరగతి ప్రీ-ఫైనల్ పరీక్షా సమయాలను మార్చింది. గతం పరీక్షా సమయం మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ఉండేది. దానిని ఇప్పుడు ఒక గంట మార్చారు. సోమవారం జారీ చేసిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం.. పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు మధ్యాహ్నం 12.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు ఉంటాయి. భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం పరీక్షలను గంటన్నర వ్యవధిలోనే నిర్వహించనున్నారు. 

10వ తరగతి ఇంటర్‌, డిగ్రీ అర్హతతో జాబ్‌మేళా రాతపరీక్ష లేకుండా డైరెక్ట్‌ జాబ్‌ జీతం నెలకు 1,55,000: Click Here

అంటే ఈ పరీక్షలు మధ్యాహ్నం 1.45 గంటలకు ముగుస్తాయి. సమయం మార్పు దృష్ట్యా మధ్యాహ్నం 12.15 గంటలలోపే పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించబడుతుంది. మార్చి 6వ తేదీ నుంచి ఈ ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభమై.. మార్చి 15వ తేదీన ముగియనున్నాయి. ఈ ప్రీ-ఫైనల్ పరీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు టైమ్ టేబుల్ ను గతంలోనే విడుదల చేసింది.

పదో తరగతి ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ షెడ్యూల్ 

మార్చి 6- ఫస్ట్ లాంగ్వేజ్ 
మార్చి 7 -సెకండ్ లాంగ్వేజ్ 
మార్చి 10 - ఆంగ్లము 
మార్చి 11 - గణితం 
మార్చి 12 - భౌతిక శాస్త్రం 
మార్చి 13- జీవ శాస్త్రం 
మార్చి 15 - సోషల్ స్టడీస్


పదో తరగతి ఫైనల్ పరీక్షల షెడ్యూల్‌ ఇదే.. 

మార్చి 21- ఫస్ట్ లాంగ్వేజ్ 
మార్చి 22- సెకండ్ లాంగ్వేజ్ 
మార్చి 24- ఆంగ్లము 
మార్చి 26-గణితం 
మార్చి 28 - భౌతిక శాస్త్రం 
మార్చి 29 - జీవ శాస్త్రం 
ఏప్రిల్ 2 -సోషల్ స్టడీస్
ఏప్రిల్ 3-పేపర్-1 లాంగ్వేజ్ పరీక్ష(ఒకేషనల్ కోర్సు) 
ఏప్రిల్ 4 - పేపర్-2 లాంగ్వేజ్ పరీక్ష(ఒకేషనల్ కోర్సు)

 

Published date : 06 Feb 2025 08:27AM

Photo Stories