School Holidays: తెలంగాణ, ఏపీ విద్యార్థులకు శుభవార్త.. వరుసగా మూడు రోజులు సెలవులు..
మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించగా.. అయితే ఆ రోజు శుక్రవారం రావడం.. మరుసటి రోజు రెండవ శనివారం, ఆదివారం రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.
చదవండి:
ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
మహాశివరాత్రి అంటే ఏమిటి, దాన్ని ఎందుకు జరుపుకుంటారు?
ప్రతీ చాంద్రమాన మాసం లోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి – మార్చ్ లలో వచ్చేదానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ రాత్రి, భూమి ఉత్తర అర్థగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే, మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది.
మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో వచ్చే రోజుని మహాశివరాత్రి అంటారు.
ఫిబ్రవరి 8వ తేదీన (గురువారం) సెలవు..
ఫిబ్రవరి 8వ తేదీన (గురువారం) తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా.. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్‌కు సెలవు దినంగా ప్రకటించింది.
కానీ ఇది ఐచ్ఛిక సెలవు కింద పేర్కొనబడింది. సాధారణ సెలవుగా చేర్చబడింది. ఇప్పుడు సాధారణ సెలవు దినంగా మారింది. షబ్-ఎ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు ఈ పర్వానా మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ఫిబ్రవరి 8న (గురువారం) సాధారణ సెలవు దినం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవును ప్రకటించారు. కానీ ఫిబ్రవరిలో సాధారణ సెలవులు లేవు.
చదవండి:
ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్ పేపర్స్ | న్యూస్
టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్
2024లో సెలవులు వివరాలు ఇవే..
☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్