Skip to main content

‘మన ఊరు – మనబడి’ గడువులోపు పూర్తి చేయాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి చేపట్టిన మన ఊరు – మనబడి పనులు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
Manauru - Manabadi
మన ఊరు – మనబడి

సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మన ఊరు – మనబడి, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల వివరా లు అడిగి తెలుసుకున్నారు. డ్యామేజ్‌ అయిన రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అర్లి వంతెన నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయడం జరుగుతుందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. విరిగిన విద్యుత్‌ స్తంభాలను త్వరగా పునరుద్ధరించాలన్నారు. రైతులకు రైతుబీమాపై అవగాహన కల్పించి బీమా చేయించాలని, దానిని ఏటా రెన్యూవల్‌ చేసుకునేలా చూడాలన్నారు.

Published date : 04 Aug 2023 04:12PM

Photo Stories