Skip to main content

Best Teachers Awards: ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

● జిల్లా వ్యాప్తంగా 61 మందికి సత్కారం
Best Teachers Awards
Best Teachers Awards

చిత్తూరు కలెక్టరేట్‌ : గురుపూజోత్సవం సందర్భంగా జిల్లాలోని సర్కారు స్కూళ్లల్లో ఉత్తమ సేవలందించిన టీచర్లకు అవార్డులు అందజేశారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశమందిరంలో మంగళవారం ఘనంగా గురుపూజోత్సవం కార్యక్రమం నిర్వహించారు. అతిథులుగా పాల్గొన్న ఎంపీ రెడ్డెప్ప, ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, మేయర్‌ అముద, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ రమ్య చేతుల మీదుగా 61 మంది టీచర్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో డీఈఓ విజయేంద్రరావు, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Published date : 06 Sep 2023 06:33PM

Photo Stories