RTE Act.. AP Private Schools Admissions 2024-25 : పేద విద్యార్ధులకు వరం.. ప్రైవేటు స్కూళ్లలో 'ఆర్టీఈ' చట్టం కింద 1వ తరగతిలో ప్రవేశాలు.. పూర్తి వివరాలు ఇవే..
ఐబీ (అంతర్జాతీయ), ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, స్టేట్ సిలబస్ స్కూళ్లన్నిటిలోను విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను అర్హులైన పేదలకు కేటాయించాల్సి ఉంటుంది. విద్యార్థులు రిజిస్ట్రేషన్లను https://cse.ap.gov.in/లో నమోదు చేయాలి.
ప్రవేశాలకు ఏమైన సమస్యలు ఉంటే 14417 టోల్‌ఫ్రీ నెంబర్‌కి..
ఈ ప్రైవేటు స్కూళ్లలో ఆర్టీఈ చట్టం కింద ప్రవేశాలకు సంబంధించి సమస్యలు తలెత్తితే 14417 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించాలి. ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలను, విధివిధానాలను జీవోలో వివరించారు. ఈ స్కూళ్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఒక్కో విద్యార్థికి పట్టణప్రాంతాల్లో రూ.8 వేలు, రూరల్‌లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100 చొప్పున చెల్లిస్తారని జీవోలో తెలిపారు. రాష్ట్రంలోని తమ పిల్లలను బడులకు (ప్రభుత్వ, లేదా ప్రైవేటు) పంపించే అర్హులైన పేద తల్లులందరికీ అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 75 శాతం, ఆపై హాజరు నిబంధన అమలు చేస్తూ పేద పిల్లలందరికీ అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తున్నారు.
తల్లిదండ్రులు చెల్లించకపోతే ప్రభుత్వం ఆ మొత్తాన్ని..
ప్రైవేటు స్కూళ్లలో సీట్లు పొందే ఈ పిల్లలకు సంబంధించి ఆయా స్కూళ్లకు చెల్లించాల్సిన ఫీజును నిబంధనలను అనుసరించి అమ్మ ఒడిని అందుకున్న అనంతరం విద్యాసంవత్సరం చివరన ఆయా స్కూళ్లకు రీయింబర్స్ చేస్తారని జీవోలో పేర్కొన్నారు. అలా తల్లిదండ్రులు చెల్లించకపోతే ప్రభుత్వం ఆ మొత్తాన్ని తదుపరి అమ్మ ఒడి నుంచి మినహాయించి స్కూళ్లకు చెల్లిస్తుందని తెలిపారు.
1వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇవే..
Activities |
Schedule |
Issuance of Notification with Calendar of events for admissions |
12th February 2024 |
Registration of all Private Un- aided Schools Following IB/ICSE/CBSE/State syllabus in the portal @cse.ap.gov.in |
13th February 2024- 20th February 2024 |
Window open for the Student Registration on the portal |
23rd February 2024 - 14th March 2024 |
Determination of eligibility of students for admission through GSWS Data |
20th March to 22nd March 2024 |
Publication of 1st round lottery results |
1st April 2024 |
Confirmation of student admissions by Schools |
2nd April, 2024 to 10th April, 2024 |
Publication of 2nd round lottery results |
15th April 2024 |
Confirmation of student admission by Schools |
16th April to 23rd April 2024 |
Tags
- AP RTE Admission 2024-25 Schedule Details
- AP Private Schools 25% RTE Free Seats Admissions 2024 Notification
- AP Private Schools 25% Free Seats 2024-2025
- AP Private Schools 25% Free Seats 2024-2025 Details in Telugu
- AP RTE 1st Class ADMISSIONS 2024 Notification Details in Telugu
- ap private school free admission 2024 25
- ap private school free admission 2024 25 news in telugu
- 1st class admissions
- 1st class admission open in ap
- private school 1st class admission open in ap
- AP Private Schools 25% RTE Free Seats Admissions 2024
- AP Private Schools 25% RTE Free Seats Admissions 2024-25 For Poor Students
- ap education news
- ap schools news telugu
- students news ap