బోధన లక్ష్యాలు- స్పష్టీకరణాలు
Sakshi Education
తరగతి బోధనలో ఉపాధ్యాయుని దృష్టిలో ఉంచుకున్న అంతిమ గమ్యమే లక్ష్యం. బోధన అనంతరం విద్యార్థి ప్రవర్తనలో కనిపించే స్పష్టమైన మార్పులే స్పష్టీకరణాలు.
జ్ఞానం
సాంఘిక శాస్త్రంలోని జ్ఞానం, సామాజిక శాస్త్రాల్లో ప్రాథమిక భావనల ఆధారంగా ఏర్పడింది. సామాజిక శాస్త్రాల్లోని జ్ఞానం అనుభవపూర్వకంగా, హేతుబద్ధంగా ఆలోచిం చడం, ప్రబోధాత్మక జ్ఞానం వల్ల ఏర్పడింది. సాంఘిక శాస్త్ర బోధనలో మొదటి లక్ష్యం జ్ఞానం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కింది అంశాల గురించిన జ్ఞానం అందించాలి.
I.భావనలు (Concepts): ఏదైనా ఒక అంశం గురించి మనం సాధారణంగా ఏర్పర్చుకునేదే భావన.
భావనలు వివిధ రకాలు:
i) మూర్త భావనలు (Concreet Con-cept): మృత్తికలు, ఆహార పంటలు, నగదు పంటలు, లోహ, అలోహ ఖనిజాలు. ఇవి కంటికి కనిపిస్తాయి.
ii) అమూర్త భావనలు (Abstract Conce pts): ఇవి నిరాకారమైనవి.
ఉదా: ప్రజాస్వామ్యం, సమానత్వం, సామ్యవాదం, లౌకికత్వం, అంతర్జాతీయ అవగాహన, జాతీయ సమైక్యత.
iii) కాల భావనలు (Concept of Time): సంవత్సరాలు, తేదీల్లో జరిగిన ముఖ్య సంఘటనలకు సంబంధించిన జ్ఞానం.
ఉదా: 1949 నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదించిన రోజు.
1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు.
iv) ప్రాదేశిక భావనలు (Concept of place): ఒక ప్రదేశం దిక్కులు, మూలలకు చెందిన జ్ఞానం.
II. యథార్థాలు (Facts): మారని సత్యం అని అర్థం.
ఉదా: భూమి గుండ్రంగా ఉంటుంది.
III. సాధారణీకరణాలు (Generalisations): ఆగమన వివేచనం ద్వారా ఒక అంశం గురించి తుది నిర్ణయానికి రావడమే సాధారణీకరణం.
ఉదా: ఎత్తయిన ప్రాంతాలు చల్లగా ఉంటాయి.
IV. నిర్వచనాలు:
‘ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల వల్ల ఏర్పడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యం’ అని ప్రజాస్వామ్యం గురించి అబ్రహం లింకన్ నిర్వచించారు.
V. సాంకేతిక పదాలు:
స్లీట్, కోరమ్, మాగ్మా, లావా.
VI. సూత్రాలు: సూత్రాన్ని విశ్వవ్యాప్తంగా ఆమోదిస్తారు. ఇవి పరిశీలన, ప్రయోగాల ద్వారా నిరూపితమవుతాయి.
ఉదా: డిమాండ్ సూత్రం: మిగతా పరిస్థితులు(వినియోగదారుని ఆదాయం, అభిరుచి, ప్రత్యామ్నాయ వస్తువుల ధర) స్థిరంగా ఉన్నప్పుడు, ఒక వస్తువు ధర పెరిగితే, దాని డిమాండ్ తగ్గుతుంది. ఆ వస్తువు ధర తగ్గితే, దాని డిమాండ్ పెరుగుతుంది.
VII. వ్యక్తుల పేర్లు:
స్వాతంత్య్ర సమరయోధులు (సుభాష్ చంద్రబోస్); రాజులు, చక్రవర్తులు (అశోకుడు, అక్బర్); సంఘసేవకులు (మదర్ థెరిస్సా) మొదలైన అంశాల గురించి జ్ఞానం అందించాలి.
VIII. ప్రదేశాల పేర్లు:
జలియన్ వాలాబాగ్, పానిపట్టు 1526 (మొగలు, ఇబ్రహీం లోఢీ).
జ్ఞానం అనేది లక్ష్యం స్మృతికి సంబంధించింది.

- తెలియంది తెలుసుకోవడమే జ్ఞానం.
- ఎవరు? ఏమిటి? ఎక్కడ? ఎవరికి? అనే ప్రశ్నలకు వచ్చే సమాధానాలను జ్ఞాన సంబంధమైనవిగా భావించాలి.
- ఉపాధ్యాయుడు తరగతి బోధనలో సాంకే తిక పదాలు, భావనలు, యథార్థాలు, సాధారణీకరణాలు, సూత్రాలు, సంవ త్సరాలు, తేదీల గురించి జ్ఞానం అందించాలి.
జ్ఞానం అనే లక్ష్యాన్ని పరీక్షించడానికి రెండు స్పష్టీకరణాలు ఉన్నాయి.
అవగాహన: ఉపాధ్యాయుడు తరగతిలో జ్ఞానం అనే లక్ష్యాన్ని బోధించిన తర్వాత అవగాహన అనే లక్ష్యాన్ని సాధించాలి. జ్ఞానం అవగాహనకు సోపానం. అవగాహన అంటే ఏదైనా భావనలను యథాతథంగా కాకుండా అర్థవం
తంగా అభ్యసించడం.
అవగాహన స్పష్టీకరణలు:
విచక్షణ: విద్యార్థి భావనలు, సూత్రాలు, యధార్థాల మధ్య తేడాలు (తారతమ్యాలు భేదాలు, వ్యత్యాసాలు) గుర్తించడం.
1. ప్రత్యక్ష పన్నులకు, పరోక్ష పన్నులకు మధ్య తేడా తెలుసుకోవడం.
2. సూర్య, చంద్ర గ్రహణాల మధ్య తేడా తెలుసుకోవడం.
3. చెక్కుకు, డ్రాఫ్టుకు మధ్య తేడా తెలుసుకోవడం.
వర్గీకరించడం: భావనలను విద్యార్థి వివిధ రకాలుగా పేర్కొనడం.
1. బడ్జెట్‌ను మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్, సంతులిత బడ్జెట్‌లుగా వర్గీకరించడం.
2. నిరుద్యోగాన్ని ఇచ్ఛాపూర్వక, అనిచ్ఛాపూర్వక నిరుద్యోగంగా వర్గీకరించడం.
3. ప్రభుత్వాన్ని శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలుగా వర్గీకరించడం.
సరిపోల్చడం: భావనల మధ్య పోలికలను చెప్పడం.
1. జైనమతాన్ని, బౌద్ధమతంతో సరిపోల్చడం.
2. గవర్నర్ అధికారాలను రాష్ర్టపతి అధికారా లతో సరిపోల్చడం.
3. హైకోర్టు విధులను సుప్రీంకోర్టు విధులతో సరిపోల్చడం.
ఉదాహరణలివ్వడం: ఉపాధ్యాయుడు ఉదాహర ణలివ్వడం ఒక బోధన నైపుణ్యం. దానికి అదనంగా విద్యార్థి మరో ఉదాహరణ ఇచ్చిన ట్లయితే అతడు పాఠ్యాంశాలను అర్థం చేసుకున్నాడని భావం.
1. ఉచిత వస్తువులకు గాలి, నీరు ఉదాహరణగా పేర్కొనడం.
2. ఆహార పంటలకు వరి, గోధుమ జొన్న ఉదాహరణగా పేర్కొనడం.
3. ఐచ్ఛిక ద్రవ్యానికి చెక్కు, డ్రాఫ్టులను ఉదాహరణగా పేర్కొనడం.
పరస్పర సంబంధాలను గుర్తించడం: వివిధ భావనల మధ్య విద్యార్థి సంబంధాలను గుర్తించడం.
1. ధరకు డిమాండ్‌కు మధ్య విలోమ సంబంధాన్ని గుర్తించడం.
2. డిమాండ్‌కు సప్లయ్‌కు మధ్య అనులోమ సంబంధాన్ని గుర్తించడం.
3. అడవుల నరికివేతకు, వాతావరణ సమతౌ ల్యం దెబ్బ తినడానికి మధ్య సంబంధాన్ని గుర్తించడం.
వివరించడం:
విద్యార్థి ఏదైనా ఒక భావనను సులభం నుంచి క్లిష్టతకు, తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాలకు అర్థవంతంగా చెప్పడాన్ని వివరిం చడం అంటారు.
1. విద్యార్థి భూభ్రమణం, భూపరిభ్రమణం అనే అంశాలను అర్థవంతంగా చెప్పడం.
వ్యాఖ్యానించడం:
విద్యార్థి దత్తాంశాలను అర్థవంతంగా చెప్పడం.
1. 1951 నుంచి 2011 వరకు వివిధ దశాబ్దాల్లోని అక్షరాస్యత రేటు ఆధారంగా భారతదేశంలో అక్షరాస్యత పెరిగింది అని వ్యాఖ్యానించడం.
1951 | 18.3% |
1991 | 52.5% |
2001 | 65% |
2011 | 74.04% |
తప్పులను గుర్తించడం: విద్యార్థి ఏదైనా ఒక వాక్యంలో తప్పులను గుర్తించడం.
1. ‘మొఘలు సామ్రాజ్య స్థాపకుడు అక్బర్’ అనే వాక్యం తప్పు అని విద్యార్థి గుర్తించాడు.
తప్పులను సరిదిద్దడం: విద్యార్థి ఏదైనా ఒక వాక్యంలో తప్పులను గుర్తించి వాటిని సరి దిద్దడం.
1. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అక్బర్ అనే వాక్యంలోని తప్పును అక్బర్‌కు బదులుగా బాబర్‌గా విద్యార్థి సరిదిద్దాడు.
వినియోగం:
సమస్యా పరిష్కారంలో అవగాహన చేసుకున్న జ్ఞానాన్ని ఉపయోగించడాన్ని వినియోగం అంటారు. జ్ఞానం, అవగాహన తర్వాత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బోధనలో వినియోగం అనే లక్ష్యాన్ని సాధించాలి.
వినియోగం స్పష్టీకరణాలు:
ఎత్తయిన ప్రాంతాలు చల్లగా ఉంటాయా? లేదా? అనే సమస్యను ఇచ్చినపుడు విద్యార్థి ప్రతిస్పందనలో కింది అంశాలను గమనించ వచ్చు.
1. సమస్యా పరిష్కారానికి నూతన జ్ఞానం ఎంపిక: ఎత్తయిన ప్రాంతాలు, అక్కడి ఉష్ణోగ్రత మొదలైన అంశాలను వార్తా పత్రికలు, పాఠ్యగ్రంథాల ద్వారా అధ్యయనం చేసి తగిన జ్ఞానాన్ని పొందుతాడు.
2. పరికల్పన రూపొందించుకోవడం: పరికల్పన అంటే సమస్యా పరిష్కారంలో తాత్కాలిక పరిష్కార మార్గం.
3. పరికల్పన పరీక్షించడం: విద్యార్థులు ఎత్తయిన ప్రాంతాలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు సేకరించడం.
4. దత్తాంశాలను విశ్లేషించడం: విశ్లేషించడం ఒక ఆలోచన ప్రక్రియ. విడివిడిగా పరిశీ లించడమే విశ్లేషణ. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ. సమస్యా పరిష్కారంలో ఇదే మొదటిది.
ఉదా: విద్యార్థి తిరుమల, ఊటీ, సిమ్లా డార్జిలింగ్, ముస్సోరి, సింహాచలం కొండలు మొదలైన ఎత్తయిన ప్రాంతాలకు సంబంధించిన ఉష్ణోగ్రతలను విడివిడిగా పరిశీలిస్తారు.
5. సంశ్లేషణ: సంశ్లేషణ ఒక ఆలోచన ఫలితం, కలుపుకోవడం. సమస్యా పరిష్కారంలో విశ్లేషణ తర్వాత రెండోది సంశ్లేషణ.
ఉదా: విద్యార్థి కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలన్నింటినీ కలుపుకుంటాడు.
6. పరస్పర సంబంధాలు స్థాపించడం:
పరస్పర సంబంధాలను గుర్తించడం అనేది అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణం అయితే విద్యార్థి తనంతట తాను పరిశోధన చేసి రెండు భావనల మధ్య సంబంధాలను ఏర్పరిస్తే అది వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణ.
ఉదా: విద్యార్థి ఎత్తయిన ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రత తక్కువగా ఉండడానికి పరస్పర సంబంధాలను ఏర్పరచడం.
7. సాధారణీకరించడం: సాధారణీకరణంలో ఒక అంశం గురించి తుది నిర్ణయానికి వస్తారు. సాధారణీకరణం చేసేటపుడు సమస్యా పరిష్యార మార్గంలో రూపొందించుకున్న పరికల్పన ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
ఉదా: ఎత్తయిన ప్రాంతాలు చల్లగా ఉంటాయి.
నైపుణ్యం:
ఏదైనా ఒక పనిని సమర్థంగా చేయడాన్ని నైపుణ్యం అంటారు. విద్యార్థి సాంఘికశాస్త్ర భావనలను తన చేతితో వేగంగా, స్పష్టంగా, కచ్చితంగా చేయడాన్ని నైపుణ్యంగా చెప్పవచ్చు.
ఏదైనా పనిని పలుసార్లు ఆచరించడం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు.
నైపుణ్యం- స్పష్టీకరణాలు:
1. విద్యార్థి చార్టులు, మ్యాపులు గీయడం: ఉదా: వంశ వృక్ష చార్టులు, బడ్జెట్ సంబంధించిన సర్కిల్ గ్రాఫ్, భారతదేశ పటాన్ని గీయడం.
2. చార్టులు, గ్రాఫ్‌లు మ్యాప్‌లలో సంబంధిత సమాచారాన్ని గుర్తించడం:
ఉదా: విద్యార్థి భారతదేశ పటంలో లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా
నగర్ హవేలి, చండీగఢ్, డామన్ డయ్యూ మొదలైన కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తించడం.
3. విద్యార్థి నమూనాలను తయారు చేయడం:
ఉదా: సౌరకుటుంబం పాఠం విన్న తర్వాత దాని నమూనాను తయారు చేయడం.
4. పరికరాలను ఉపయోగించడం:
ఉదా: విద్యార్థి వర్షమాపని, ఉష్ణమాపని వంటి పరికరాలను ఉపయోగించడం.
5. సేకరించిన సమాచారాన్ని నివేదికగా తయారుచేసి విద్యార్థి చక్కగా ప్రదర్శించడం:
ఉదా: సమాచారాన్ని సేకరించి చిత్రాల రూపంలో విద్యార్థి నివేదించడం.
అభిరుచి:
ఒక నిర్దిష్టమైన కృత్యాలపై విద్యార్థి తదేకంగా దృష్టి నిలిపి, వాటిపై ఆసక్తి చూపించడాన్ని అభిరుచి అంటారు.
అభిరుచులు స్పష్టీకరణాలు:

- విద్యార్థి నాణేలు, తపాళా బిళ్లలు, మాతృకలు సేకరిస్తాడు.
- వార్తా పత్రికలు చదువుతాడు.
- వార్తాపత్రికలకు వ్యాసాలు రాస్తాడు.
- వస్తు ప్రదర్శనలు, వివిధ కళలు సాంఘిక శాస్త్ర సంబంధమైన కార్యకలాపాల్లో పాల్గొంటాడు.
- విద్యార్థి చారిత్రక, భౌగోళిక, పౌర, అర్థశాస్త్ర సంబంధ స్థలాలను సందర్శిస్తాడు.
- విద్యార్థి పాఠశాలలో వస్తు ప్రదర్శనలను నిర్వహిస్తాడు.
వైఖరులు:
విద్యార్థికి దేశం, జాతులు, వ్యక్తులు, చట్టాలు, సమాజం పట్ల ఉండే నిర్దిష్ట అభిప్రాయాలే వైఖరులు.
వైఖరులు స్పష్టీకరణాలు:
విద్యార్థికి దేశం, జాతులు, వ్యక్తులు, చట్టాలు, సమాజం పట్ల ఉండే నిర్దిష్ట అభిప్రాయాలే వైఖరులు.
వైఖరులు స్పష్టీకరణాలు:
- దేశభక్తి కలిగి ఉంటాడు.
- ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తాడు.
- నూతన విషయాలను... వాటి ప్రాముఖ్య తను బట్టి ఆమోదిస్తాడు.
- జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై న్యాయాన్యాయాలను విశ్లేషిస్తాడు.
- ప్రజల సమస్యలను సానుభూతితో పరిశీలిస్తాడు.
- చట్టాలను గౌరవిస్తాడు.
- వివిధ జాతులు, ప్రజల జీవనం పట్ల గౌరవం చూపుతాడు.
- సాంఘిక, పౌర సంబంధ పనుల్లో ఇతరులకు సహకరిస్తాడు.
ప్రశంస లేదా అభినందన:
సంఘ సేవకులు, స్వాతంత్య్ర సమర యోధులు, గొప్ప వారి లక్షణాలను, దేశ సాంస్కృతిక వారసత్వ సంపదను విద్యార్థులు అభినందించేలా చేయడం సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యం.
ప్రశంస స్పష్టీకరణాలు:
సంఘ సేవకులు, స్వాతంత్య్ర సమర యోధులు, గొప్ప వారి లక్షణాలను, దేశ సాంస్కృతిక వారసత్వ సంపదను విద్యార్థులు అభినందించేలా చేయడం సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యం.
ప్రశంస స్పష్టీకరణాలు:
- మహనీయులు ఆచరించిన సిద్ధాంతాలను, సూత్రాలను ప్రశంసిస్తాడు.
- శాస్త్రజ్ఞులు, పరిశోధకుల గొప్పదనాన్ని ప్రశంసిస్తాడు.
- గొప్పవారి జీవిత చరిత్రలు చదివేటప్పుడు వారిలోని ఉన్నత వ్యక్తిత్వాన్ని అభినందిస్తాడు.
- దేశ, రాష్ర్ట సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసిస్తాడు.
- వివిధ జాతుల ప్రజల మధ్య సంబంధాన్ని ప్రశంసిస్తాడు.
గతంలో అడిగిన ప్రశ్నలు
1. ‘మీ నియోజక వర్గంలో పోలింగ్ శాతాన్ని మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించండి’ అనే ప్రశ్న ఏ లక్ష్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించింది? (2012)
1) వినియోగం - కారణాలు చెప్పడం
2) నైపుణ్యం - అనువాదం చేయడం
3) అవగాహన - వివరణ ఇవ్వడం
4) వినియోగం -సంశ్లేషణ
2. ‘వివిధ మతాలున్న భారతీయ సమాజంలో లౌకికత్వం ఒక నిర్బంధ జీవన విధానం అంగీకరిస్తారా? లేదా?’ అనే ప్రశ్న ఏ లక్ష్య సాధనకు ఉద్దేశించింది? (2012)
1) అవగాహన
2) వైఖరి
3) జ్ఞానం
4) నైపుణ్యం
3 కిందివాటిలో అభిరుచి లక్ష్యం స్పష్టీ కరణ?(2012)
1) భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అభినందించడం
2) సెమినార్‌లలో పాల్గొనడం
3) సరైన సమయంలో పన్నులు చెల్లించడం
4) ఇతరుల అభిప్రాయాలను గౌర వించడం
4. ‘ధర, డిమాండ్ మధ్య సంబంధాన్ని వివరించండి’ అనే ప్రశ్న ఏ లక్ష్య సాధనను ఉద్దేశించింది? (2012)
1) అవగాహన
2) వైఖరి
3) నైపుణ్యం
4) జ్ఞానం
5. పబ్లిక్ నీటి కుళాయి నుంచి వృథాగా పోతున్న నీటిని ఆపడానికి విద్యార్థి చేసిన ప్రయత్నం ఏ లక్ష్య సాధనకు సంబంధించింది? (2008)
1) నైపుణ్యం
2) అభిరుచి
3) అవగాహన
4) వైఖరి
6. బడ్జెట్ పాఠం విన్న ఒక విద్యార్థి ప్రభుత్వం ప్రవేశ పెట్టే లోటు బడ్జెట్ వల్ల కలిగే ఫలితాలను ఊహించగలిగితే ఏ లక్ష్యం నెరవేరినట్లు భావించవచ్చు? (2008)
1) వినియోగం
2) జ్ఞానం
3) అవగాహన
4) అభిరుచి
7. వినియోగం అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? (డీఎస్సీ-2006)
1) విచక్షణ చేయడం
2) ఉదాహరణలు ఇవ్వడం
3) సాధారణీకరించడం
4) నమూనాలను తయారుచేయడం
8. ప్రపంచ శాంతిని కాపాడటంలో ఐక్య రాజ్యసమితి పాత్రలో ప్రధానంగా అభినందించదగింది? (డీఎస్సీ-2006)
1) నైపుణ్యానికి సంబంధించింది
2) మానసిక, చలనాత్మక రంగానికి సంబంధించింది
3) జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది
4) భావావేశ రంగానికి సంబంధించింది
9. విద్యార్థి బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన తుఫానును చక్రవాత వర్షపాతానికి ఉదాహరణగా పేర్కొన్నాడు.ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం? (డీఎస్సీ-2006)
1) అవగాహన
2) నైపుణ్యం
3) జ్ఞానం
4) వినియోగం
10. సౌర కుటుంబం పాఠాన్ని 8వ తరగతి విద్యార్థి అభ్యసించిన తర్వాత ఓ రోజు స్నేహితులతో కలిసి నక్షత్రశాలను సందర్శించాడు. దీన్ని బట్టి అతడు ఏ లక్ష్యాన్ని సాధించాడని చెప్పొచ్చు? డీఎస్సీ-2004)
1) వైఖరి
2) అభిరుచి
3) నైపుణ్యం
4) ప్రశంస
11. విద్యావిధానం విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నపుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువు? (డీఎస్సీ-2004)
1) సామర్థ్యం
2) కనీస అభ్యసన స్థాయి
3) లక్ష్యం
4) ఉద్దేశం
12. ‘గ్రామ పంచాయతీ, పురపాలక సంఘా ల విధుల్లో పోలికలు, భేదాలను తెలపం డి?’ ప్రశ్న ఏ లక్ష్యానికి చెందింది?(డీఎస్సీ - 2002)
1) వినియోగం
2) జ్ఞానం
3) వైఖరి
4) అవగాహన
13. విధేయత, వ్యక్తిగత సామాజిక బాధ్యత వంటి అంశాలను పెంపొందించడం ఏ లక్ష్యం? (డీఎస్సీ-2004)
1) అవగాహన
2) జ్ఞానం
3) నైపుణ్యం
4) వైఖరి
14. ప్రశంస ఒక?(డీఎస్సీ- 2004)
1) రంగం
2) స్పష్టీకరణ
3) ఆశయం
4) లక్ష్యం
సమాధానాలు

1) 4 | 2) 2 | 3) 2 | 4) 1 | 5) 4 | 6) 1 | 7) 3 | 8) 4 | 9) 1 | 10) 2 | 11) 3 | 12) 4 | 13) 4 | 14) 4 |
మాదిరి ప్రశ్నలు
1. ‘పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ మధ్య తేడాలను పేర్కొనండి’ అనే ప్రశ్న ద్వారా పరీక్షించదలచుకున్న లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
2. ‘ప్రజాస్వామ్య సమస్యలను విశ్లేషిం చండి’ అనే ప్రశ్న ద్వారా పరీక్షించదల చుకున్న లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
3. వర్షమాపనిని ఉపయోగించి పాఠశాలలో వర్షపాతాన్ని నమోదు చేసిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
4. ‘లౌకికత్వం ఒక జీవన విధానం వివ రించండి’ అనే ప్రశ్న ద్వారా ఉపాధ్యాయుడు పరీక్షించదలచుకున్న లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) అభిరుచులు
4) నైపుణ్యం
5. జనాభా నివారణ చర్యలు అనే అంశంపై వ్యాసం రాసిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) వినియోగం
2) అవగాహన
3) అభిరుచులు
4) వైఖరి
6. ప్రాథమిక హక్కులను వర్గీకరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
7. సూర్య కుటుంబం పాఠ్యాంశం విన్న తర్వాత సమీపంలోని ప్లానిటోరియాన్ని సందర్శించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) ప్రశంస
2) వైఖరులు
3) అభిరుచులు
4) వినియోగం
8. ఎత్తయిన ప్రాంతాలు, ఉష్ణోగ్రత తగ్గడానికి పరస్పర సంబంధాన్ని స్థాపించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) అవగాహన
2) వినియోగం
3) అభిరుచులు
4) నైపుణ్యం
9. పాఠశాలలో సాంఘిక శాస్త్రానికి సంబంధించిన వస్తు ప్రదర్శన శాల నిర్వహించడం?
1) వైఖరి
2) వినియోగం
3) అభిరుచి
4) నైపుణ్యం
10. మానసిక చలనాత్మక రంగానికి సంబం ధించని లక్ష్యం?
1) సునిశితత్వం
2) వ్యవస్థాపనం
3) సమన్వయం
4) హస్తలాఘవం
11. బ్లూమ్స్ వర్గీకరించిన జ్ఞానాత్మక రంగం లోని లక్ష్యాలు సరళం నుంచి క్లిష్టతకు ఏ ఆధిక్యత శ్రేణిలో ఉంటాయి?
1) జ్ఞానం, అవగాహన, సంశ్లేషణ, విశ్లే షణ, మూల్యాంకనం, వినియోగం
2) జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లే షణ, సంశ్లేషణ, మూల్యాంకనం
3) జ్ఞానం, అవగాహన, సంశ్లేషణ, విని యోగం, విశ్లేషణ, మూల్యాంకనం
4) జ్ఞానం, అవగాహన, మూల్యాంకనం, వినియోగం, సంశ్లేషణ, విశ్లేషణ
12. 2001 భారతదేశ అక్షరాస్యత రేటు, ఆంధ్ర ప్రదేశ్ అక్షరాస్యత రేటుకు సంబంధించిన దత్తాంశాలను వ్యాఖ్యానించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
13. మదర్ థెరిసా సేవానిరతిని ప్రశంసించిన విద్యార్థి ఏ రంగంలోని ప్రవర్తనలో మార్పు కలిగింది?
1) జ్ఞానాత్మక రంగం
2) భావావేశ రంగం
3) మానసిక చలనాత్మక రంగం
4) జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం
14. పరీక్ష మార్కులతో నిమిత్తం లేకుండా ఉత్తీర్ణులయ్యే పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 1961
2) 1971
3) 1981
4) 1977
15. కిందివాటిలో అవగాహన అనే లక్ష్యానికి సంబంధించింది?
1) దత్తాంశాలను వ్యాఖ్యానిస్తాడు
2) దత్తాంశాలను విశ్లేషిస్తాడు
3) దత్తాంశాల ఆధారంగా పరస్పర సంబంధాలు గుర్తిస్తాడు
4) పోలికలు, భేదాలు చెపుతాడు
16. ‘విద్యార్థులు పాలు పంచుకునే గుణానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. కానీ లక్ష్య సాధనకు కాదు’ అని అభిప్రాయపడినవారు?
1) ఆర్‌నవెల్
2) జాన్‌సన్
3) బ్లూమ్స్
4) డివే
17. జర్మనీ ఏకీకరణలో బిస్మార్‌క నిర్వహించిన పాత్రను వివరించండి? అనే ప్రశ్న ద్వారా ఉపాధ్యాయుడు పరీక్షించదలచుకున్న లక్ష్యం?
1) జ్ఞానం
2) వినియోగం
3) అవగాహన
4) నైపుణ్యం
18. నాణేలను సేకరించడం, ఆల్బమ్‌ల్లో చిత్రా లను భద్రపరచడం మొదలైన ప్రవ ర్తనాంశాలను కలిగిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) అభిరుచులు
2) వైఖరులు
3) ప్రశంస
4) వినియోగం
19. పటాలను కచ్చితమైన స్కేల్‌తో గీయగలిగిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) వినియోగం
2) నైపుణ్యం
3) అవగాహన
4) జ్ఞానం
20. కిందివాటిలో వినియోగం అనే లక్ష్యానికి సంబంధించని స్పష్టీకరణం?
1) పరికల్పన రూపొందించడం
2) వ్యాఖ్యానించడం
3) ఫలితాలను ఊహించడం
4) సాధారణీకరించడం
21. కిందివాటిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించని లక్ష్యం?
1) సంశ్లేషణ
2) గ్రహించడం
3) విశ్లేషణ
4) మూల్యాంకనం
22. జాతీయ సమైక్యత అనే పాఠ్యాంశాన్ని విన్న తర్వాత దేశభక్తి, సహనం కలిగిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) అభిరుచులు
2) వైఖరులు
3) వినియోగం
4) ప్రశంస
23. ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం మధ్య విలోమ సంబంధం పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
24. సూర్య కుటుంబం నమూనాను తయారు చేసిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
25. వీచే దిశలను బట్టి పవనాలను వర్గీకరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
26. కింది వాటిలో భావావేశ రంగానికి సంబంధించని లక్ష్యం?
1) సహజీకరణం
2) శీల స్థాపనం
3) ప్రతిస్పందనం
4) వ్యవస్థాపనం
27. భారతదేశంలో అధిక జనాభాకు కారణాలను విశ్లేషించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
28. నౌకాశ్రయానికి - ఓడరేవుకు మధ్య తేడాలను పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
29. నీలి విప్లవం అంటే ఏమిటి అనే ప్రశ్న ద్వారా మాపనం చేయదలచుకున్న లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
30. హైస్కూల్ విద్యార్థి 10వ తరగతిలో దర్శనీయ ప్రదేశాలు అనే పాఠ్యాంశం విన్న తర్వాత చిత్తూరు జిల్లాలోని తిరుపతిని సందర్శించాడు. ఆ విద్యార్థిలో ఏ రంగంలో మార్పు కలిగింది?
1) జ్ఞానాత్మక రంగం
2) భావావేశ రంగం
3) మానసిక చలనాత్మక రంగం
4) జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక రంగాలు
31. గత మూడు రోజుల నివేదిక ఆధారంగా రేపటి ఉష్ణోగ్రతను ఒక విద్యార్థి ఊహించగలగడం అనే సామర్థ్యం ఏ లక్ష్య సాధనకు సంబంధించింది?
1) జ్ఞానం
2) అభిరుచి
3) వినియోగం
4) అవగాహన
32. ఇతరుల మాటలను గౌరవంగా వినడం ఏ బోధనా లక్ష్యానికి సంబంధించింది?
1) అవగాహన
2) వైఖరి
3) నైపుణ్యం
4) జ్ఞానం
33. రాజ్యాంగ ప్రవేశికను గుర్తుకు తెచ్చుకున్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) అభిరుచి
34. ద్రవ్యాన్ని న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం, ఇచ్ఛాపూర్వక ద్రవ్యంగా వర్గీ కరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
35. ఎకనమిక్ సర్వే దత్తాంశాల ఆధారంగా మరణ రేటు తగ్గింది అని వ్యాఖ్యానించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) అభిరుచులు
36. సమస్యా పరిష్కార పద్ధతి ప్రధానంగా ఏ రంగానికి సంబంధించింది?
1) భావావేశ రంగం
2) జ్ఞానాత్మక రంగం
3) మానసిక చలనాత్మక రంగం
4) చలనాత్మక రంగం
37. కింది వాటిలో భావావేశ రంగానికి చెందినవారు?
1) ఎలిజబెత్ సింపసన్
2) డేవిడ్ ఆర్.క్రాత్ హోల్
3) ఆర్. హెచ్. దావే
4) హౌరో
38. భావావేశ రంగంలో లక్ష్యాలు సరళత నుంచి క్లిష్టతకు వరుసగా?
1) గ్రహించడం, ప్రతిస్పందించడం, వ్యవస్థాపనం, విలువకట్టడం, శీల స్థాపనం
2) గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం
3) గ్రహించడం, ప్రతిస్పందించడం, శీల స్థాపనం, విలువకట్టడం, వ్యవస్థాపనం
4) గ్రహించడం, ప్రతిస్పందించడం, వ్యవ స్థాపనం, శీలస్థాపనం, విలువ కట్టడం
39. వివిధ జాతుల మధ్య పరస్పర సంబంధాలను విద్యార్థి ప్రశంసించడం ఏ రంగానికి చెందిన లక్ష్యం?
1) భావావేశ
2) జ్ఞానాత్మక
3) మానసిక చలనాత్మక
4) పైవేవీ కాదు
40. మానసిక చలనాత్మక రంగానికి సంబం ధించిన లక్ష్యాలు సరళత నుంచి క్లిష్టతకు వరుసగా
1) సునిశితత్వం, అనుకరణ, హస్తలాఘ వం, సహజీకరణం, సమన్వయం
2) అనుకరణ, హస్తలాఘవం, సునిశి తత్వం, సహజీకరణం
3) అనుకరణ, హస్తలాఘవం, సమ న్వయం, సునిశితత్వం, సహజీకరణం
4) అనుకరణ, హస్తలాఘవం, సమన్వయం, సునిశితత్వం, సహజీకరణం
41. నైపుణ్యం అనే లక్ష్యాన్ని సాధించడానికి అనువైన పాఠ్యపథక సోపానం?
1) పునర్విమర్శ
2) గైహికం
3) సామాన్యీకరణం
4) ప్రావేశిక చర్య
42. నదీ తీర ప్రాంతాల్లో నాగరికతలు అభివృద్ధి చెందడానికి కారణాలను పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
43. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర పాఠ్యాం శాలు విన్న విద్యార్థి దేశభక్తిని కలిగి ఉన్నాడు. ఆ విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) అభిరుచులు
2) వైఖరులు
3) ప్రశంస
4) వినియోగం
44. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల విలువల వర్గీకరణలో స్పష్టత, సంతృప్తి లేదని పేర్కొన్నవారు?
1) క్రాత్‌హోల్
2) ఆర్‌నవెల్
3) జాన్‌సన్
4) డివే
45. గాంధీజీ పాఠ్యాంశం విన్న తర్వాత ఆయన త్యాగాన్ని కొనియాడిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) అభిరుచులు
2) వైఖరులు
3) ప్రశంస
4) వినియోగం
46. పత్తి, పొగాకు నగదు పంటలకు ఉదాహరణ అని పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) నైపుణ్యం
4) వైఖరులు
47. ప్రపంచశాంతిని పెంపొందించడంలో ఏర్పడిన ఐక్యరాజ్యసమితిని నానాజాతి సమితిలో సరిపోల్చిన విద్యార్థుల్లో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
48. దేశ ఆదాయ పంపిణీ అసమానత్వాన్ని లారెంజ్ వక్రరేఖ ద్వారా విద్యార్థి గీయ డం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
49. ‘కృష్ణా, గోదావరి, మహానది, కావేరి మొద లైన నదులను పరిశీలించి ద్వీపకల్ప నదులే ఎక్కువగా బంగాళాఖాతంలో కలుస్తాయి’ అని సామాన్యీకరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
50. జాతీయ సమైక్యతకు కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం కారణాలని విశ్లేషించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
51. కిందివాటిలో వైఖరులు అనే లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణం?
1) ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం
2) భౌగోళిక, చారిత్రక స్థలాలు సందర్శించడం
3) ప్రజల సమస్యలను సానుభూతితో పరిశీలించడం
4) దేశభక్తిని కలిగిఉండటం
52. భారతదేశ చరిత్రను ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగమని వర్గీ కరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
53. ఆంధ్రప్రదేశ్ పటంలో అటవీ ప్రాంతం ఉన్న జిల్లాలను గుర్తించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
54. ప్రత్యక్ష, పరోక్ష, ప్రజాస్వామ్యం మధ్య తేడాలేమిటో వివరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
55. ఉపాధ్యాయుడు సూర్యకుటుంబం అనే పాఠ్యాంశం బోధించిన తర్వాత ‘ఎ’ అనే విద్యార్థి గ్రహానికి, నక్షత్రానికి తేడాను గ్రహించాడు. ‘బి’ అనే విద్యార్థి గ్రహాలు, ఉపగ్రహాలు, లఘు గ్రహాలను విశ్లేషిం చాడు. ‘సి’ అనే విద్యార్థి సమీపంలోని నక్షత్రశాలను సందర్శించాడు. ‘డి’ అనే విద్యార్థి సూర్యకుటుంబం నమూనా తయారు చేశాడు. పై విద్యార్థుల్లో నెరవేరిన లక్ష్యాలు?
1) ఎ- జ్ఞానం, బి- అవగాహన, సి- వినియోగం, డి-నైపుణ్యం
2) ఎ-అవగాహన, బి-వినియోగం, సి- జ్ఞానం డి- నైపుణ్యం
3) ఎ-అవగాహన, బి-వినియోగం, సి- అభిరుచి, డి-నైపుణ్యం
4) ఎ- వినియోగం, బి- అవగాహన, సి- అభిరుచి, డి- నైపుణ్యం
56. విద్యార్థులను మంచి పౌరులుగా తయారు చేయాలి అనే వాక్యం సూచించే భావన?
1) విలువ
2) ఆశయం
3) లక్ష్యం
4) స్పష్టీకరణం
57. భారత రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడు ఎవరు? అని ప్రశ్నిస్తే రాజు అనే విద్యార్థి డా. బి.ఆర్. అంబేద్కర్ అని పునఃస్మరణ చేసుకున్నాడు. రాజులో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
58. జైన, బౌద్ధ మతాల మధ్య పోలికలు చెప్పిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
59. పాఠశాలలో కురిసిన వర్షాన్ని కొలవడానికి రాహుల్ అనే విద్యార్థి వర్షమాపకం (రెయిన్ గేజ్) ఉపయోగించాడు. రాహుల్ లో నెరవేరిన లక్ష్యం?
1) వినియోగం
2) జ్ఞానం
3) అవగాహన
4) నైపుణ్యం
60. భారత దేశం ఉపఖండం అనడానికి కార ణాలు విశ్లేషించి, సంశ్లేషించి సాధారణీ కరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) వినియోగం
2) జ్ఞానం
3) అవగాహన
4) నైపుణ్యం
61. ఆదాయం, పొదుపుల మధ్య సంబంధం గుర్తించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
62. వీటిలో జ్ఞానం లక్ష్యాన్ని పరీక్షించడానికి ఉపయోగపడని ప్రశ్న?
1) భాటకం అంటే ఏమిటి?
2) అపహేళి అంటే ఏమిటి?
3) చెక్, డ్రాఫ్ట్‌ల మధ్య వ్యత్యాసాన్ని వివరించండి?
4) విక్టోరియా జలపాతం ఏ నదిపై ఉంది?
63. సహజ ఉద్భిజ సంపద అనే పాఠ్యాంశాన్ని బోధించడం ద్వారా సాధించే మౌలికాంశం?
1) శాస్త్రీయ దృక్పథం
2) పరిసరాల రక్షణ
3) భారతీయ సంస్కృతి, సంప్రదాయ పరంపర
4) జాతీయ భావనా వికాసం
64. భారతదేశం- మతసహనం పాఠ్యాంశం ద్వారా ఏ మౌలికాంశాన్ని సాధించొచ్చు?
1) రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతలు
2) సమానత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం
3) జాతీయ భావనా వికాసం
4) భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్ర
65. మానవజాతి అభివృద్ధిపై వివిధ సంస్కృ తుల ప్రభావాన్ని అవగాహన చేసుకో వడం ఏ శాస్త్రం బోధనాశయం?
1) భూగోళం
2) చరిత్ర
3) పౌరశాస్త్రం
4) అర్థశాస్త్రం
66. భావి జీవన మార్గాన్ని నిర్ణయించుకోవడం ఏ శాస్త్ర బోధనాశయం?
1) పౌరశాస్త్రం
2) అర్థశాస్త్రం
3) చరిత్ర
4) భూగోళశాస్త్రం
67. భారతదేశ ఎగుమతులు-దిగుమతులు పాఠ్యాంశం ద్వారా సాధించే ఆశయం?
1) అంతర్జాతీయ అవగాహన
2) సామాజిక అర్హతను ఏర్పర్చడం
3) ప్రజాస్వామ్య పౌరసత్వ నిర్మాణం
4) నాది అనే భావన కలిగించడం
68. విద్యా విధానం, విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నపుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువును ఏమంటారు?
1) ఆశయం
2) లక్ష్యం
3) స్పష్టీకరణం
4) విలువ
69. ధర-డిమాండ్‌ల సంబంధమేమిటి? అనే ప్రశ్నలో పరిశీలించదలచుకున్న లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
70. విద్యుచ్ఛక్తి ఉపయోగాలు విశ్లేషించండి? అనే ప్రశ్నతో ఏ లక్ష్యాన్ని పరిశీలించవచ్చు?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
71. అభిరుచి ఒక?
1) ఆశయం
2) జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యం
3) లక్ష్యం
4) స్పష్టీకరణం
72. ప్రపంచశాంతి- భారతదేశ పాత్ర అనే పాఠ్యాంశం ద్వారా ఉపాధ్యాయుడు ఏ ఆశయాన్ని సాధించవచ్చు?
1) నాది అనే భావన కలిగించడం
2) అంతర్జాతీయ అవగాహన
3) ప్రజాస్వామ్య పౌరసత్వ నిర్మాణం
4) సాంస్కృతిక వారసత్వ అభినందన
73. పరస్పర సంబంధాలను స్థాపించడం అనేది?
1) భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం
2) మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన స్పష్టీకరణం
3) జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన స్పష్టీకరణం
4) జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం
74. దర్శనీయ ప్రదేశాలు అనే పాఠ్యాంశం విన్న తర్వాత రాజు మిత్రులతో కలిసి హైదరాబాద్ సందర్శించాడు. రాజులో నెరవేరిన లక్ష్యం?
1) వైఖరి
2) వినియోగం
3) అభిరుచి
4) అవగాహన
75. నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి ఏవి?
1) ఆశయం-లక్ష్యం
2) లక్ష్యం-విలువ
3) లక్ష్యం- స్పష్టీకరణ
4) ఆశయం- స్పష్టీకరణం
76. ఉపన్యాస పద్ధతి ద్వారా ఎక్కువగా తరగతి గదిలో సాధించలేని లక్ష్యం?
1) జ్ఞానం
2) నైపుణ్యం
3) వినియోగం
4) అవగాహన
77. ఓ విద్యార్థి గ్రామ జనాభాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి గ్రాఫ్ రూపంలో ప్రదర్శించాడు. ఆ విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
78. ‘భారతదేశం- ఐక్యరాజ్యసమితి- ప్రపంచ సమస్యలు’ పాఠ్యాంశం ద్వారా విద్యార్థిలో ఏ ఆశయాన్ని సాధించవచ్చు?
1) జాతీయభావనా వికాసం
2) నాది అనే భావన
3) అంతర్జాతీయ అవగాహన
4) ప్రజాస్వామ్య పౌరసత్వం
79. సాంఘిక శాస్త్రాన్ని సమైక్యతా రీతిలో బోధించడం వల్ల విద్యార్థి?
1) ఒక విషయంతో సంబంధం ఉన్న ఇతర విషయాలను అవగాహన చేసుకుంటాడు.
2) విషయం పట్ల స్థిరమైన అభిప్రా యం ఏర్పరచుకుంటాడు.
3) వివిధ విషయాల మధ్య ఉన్న వైరుధ్యానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందుతాడు
4) అర్థరహిత సమాచారాన్ని గుర్తిస్తాడు
80. ‘భారతదేశం - భిన్నత్వంలో ఏకత్వం’ పాఠాన్ని బోధించిన తర్వాత విద్యార్థి జాతీయ సమైక్యతపై వ్యాసం రాశాడు. ఈ చర్య వల్ల ఆ విద్యార్థిలో ఏ లక్ష్యం నెరవేరిందని చెప్పవచ్చు?
1) వైఖరి
2) విలువ
3) జ్ఞానం
4) ఆసక్తి
81. విద్యార్థి అడవుల సంరక్షణకు సూచన లిస్తాడు. ఇది ఏ లక్ష్య స్పష్టీకరణ?
1) అవగాహన
2) ఆసక్తి
3) వినియోగం
4) జ్ఞానం
82. ‘భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలు’ విషయాన్ని బోధించడం ద్వారా కిందివాటిలో ఏ మౌలికాంశాన్ని సాధించవచ్చు?
1) శాస్త్రీయ దృక్పథం
2) మన సాంస్కృతిక వారసత్వం
3) భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్ర
4) స్త్రీ పురుషుల సమానత్వం
83. ‘వినియోగం’ అనే లక్ష్యానికి చెందని స్పష్టీకరణ?
1) సాధారణీకరిస్తుంది
2) పరిష్కారాన్ని సూచిస్తుంది
3) సంబంధాలను గుర్తిస్తుంది
4) ఫలితాలను ఊహిస్తుంది
84. పటంలో ఇచ్చిన ప్రదేశాన్ని గుర్తించడం ఏ లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
85. మానసిక చలనాత్మక రంగంలో ఉన్నత లక్ష్యం?
1) స్వభావీకరణ
2) న్యాయ నిర్ణయం
3) సమన్వయం
4) ప్రేరణ
86. ‘అభిరుచులను పెంపొందించుకోవటం’ అనే లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ?
1) నిర్ధారించటం
2) ఒక రూపం నుంచి మరో రూపానికి అనువదించటం
3) సామాజిక సమస్యలకు సంబంధించిన చర్చల్లో పాల్గొని ఆనందించటం
4) జాతీయ పతాకంపై గౌరవ భావాన్ని పెంపొందించుకోవటం
87. ‘సౌరకుటుంబం’ అనే పాఠాన్ని 8వ తరగతి విద్యార్థి అభ్యసించిన తర్వాత ఒక రోజు స్నేహితులతో కలిసి ‘నక్షత్రశాల’ను దర్శించి వచ్చాడు. దీన్ని బట్టి అతనిలో ఏ లక్ష్యం నెరవేరిందని చెప్పొచ్చు?
1) వైఖరి
2) అభిరుచి
3) నైపుణ్యం
4) ప్రశంస
88. విద్యా ప్రణాళికలో విషయాన్ని బట్టి మారనిది?
1) ఆశయం
2) లక్ష్యం
3) బోధనా పద్ధతి
4) స్పష్టీకరణాలు
89. ‘మీకిచ్చిన ఆంధ్రప్రదేశ్ పటంలో థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రాలను గుర్తించండి’ అనేది ఏ లక్ష్య సాధనకు ఉద్దేశించింది?
1) వైఖరి
2) జ్ఞానం
3) వినియోగం
4) నైపుణ్యం
90. ‘ప్రతి పౌరుడు నిర్వహించే ప్రాథమిక విధులను విద్యార్థి వివరించగలుగుతాడు అనేది ఏ లక్ష్య స్పష్టీకరణ?
1) జ్ఞానం
2) వినియోగం
3) అవగాహన
4) నైపుణ్యం
91. విద్యా విధానం విద్యాలక్ష్యాల వైపు పయనిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువు?
1) సామర్థ్యం
2) కనీస అభ్యసన స్థాయి
3) లక్ష్యం
4) ఉద్దేశం
92. ‘గ్రామ పంచాయతీ, పురపాలక సంఘాల విధుల్లో పోలికలు, భేదాలను తెలపండి’ అనే ప్రశ్న ఏ లక్ష్యానికి చెందింది?
1) వినియోగం
2) జ్ఞానం
3) వైఖరి
4) అవగాహన
93. రోడ్డు చిహ్నాలను అర్థం చేసుకున్న ఒక విద్యార్థి సైకిల్‌పై పాఠశాలకు, ఇతర ప్రదేశాలకు వెళుతున్నప్పుడు వాటిని పాటిస్తూ ఉంటాడు అనేది ఏ సామర్థ్యానికి సంబంధించింది?
1) చట్టాలను గౌరవించడం
2) సానుభూతి ప్రదర్శించడం
3) దేశభక్తి కలిగి ఉండటం
4) ఇతరులకు సహకరించడం
94. ఒక విద్యార్థి బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన తుఫాన్‌ను చక్రవాత వర్షానికి ఉదాహరణగా పేర్కొన్నాడు. ఇందులో సాధించిన లక్ష్యం?
1) నైపుణ్యం
2) జ్ఞానం
3) వినియోగం
4) అవగాహన
95. ‘స్త్రీలను గౌరవించడం’ అనేది ఏ లక్ష్య సాధనను సూచిస్తుంది?
1) అవగాహన
2) వినియోగం
3) వైఖరులు
4) అభిరుచులు
96. ‘ఆంధ్రప్రదేశ్ నేలలు’ అనే పాఠం అభ్యసించిన తర్వాత ఎర్రనేలల్లో పండించే పంటలకు ఉదాహరణలిచ్చిన విద్యార్థిలో పెంపొందిన లక్ష్యం?
1) అవగాహన
2) జ్ఞానం
3) నైపుణ్యం
4) వినియోగం
97. 5వ తరగతిలోని ‘భూమధ్యరేఖా ప్రాం తం’ అనే పాఠం విన్న విద్యార్థి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత, వర్షపాతం అధికంగా ఉండటం వల్ల చెట్లు దట్టంగా పెరుగుతాయని సూత్రీకరిస్తాడు. ఇది ఏ లక్ష్య సాధనకు సంబంధించింది?
1) నైపుణ్యం
2) వినియోగం
3) అవగాహన
4) జ్ఞానం
98. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అతి పెద్ద రాష్ట్రాన్ని వేరు చేయండి. అనే ప్రశ్న ఏ లక్ష్యానికి చెందింది?
1) అవగాహన
2) నైపుణ్యం
3) జ్ఞానం
4) వినియోగం
99. ‘ఉపాధ్యాయుని వల్ల ప్రేరణ పొందిన ఒక విద్యార్థి తన ప్రాంతంలోని చారిత్రక స్థలాల విషయాన్ని సేకరించి స్కూల్ బులెటిన్ బోర్‌డపై తరచుగా ప్రదర్శించాడు’. ఈ వాక్యం దేనికి సంబం ధించింది?
1) విలువ
2) ఆశయం
3) లక్ష్యం
4) స్పష్టీకరణం
100. ఆశయం (గమ్యం) ఒక?
1) మార్గం
2) చర్య
3) మార్గదర్శక సూత్రం
4) స్వల్పకాలిక గమ్యం
101. పబ్లిక్ నీటి కుళాయి నుంచి వృథాగా పోతున్న నీటిని ఆపడానికి ఒక విద్యార్థి చేసిన ప్రయత్నం ఏ లక్ష్య సాధనకు సంబంధించింది?
1) అభిరుచి
2) నైపుణ్యం
3) వైఖరి
4) అవగాహన
102. బడ్జెట్ పాఠం విన్న ఒక విద్యార్థి ప్రభు త్వం ప్రవేశపెట్టే లోటు బడ్జెట్ వల్ల కలిగే ఫలితాలను ఊహించగలిగితే ఏ లక్ష్యం నెరవేరినట్లు భావించవచ్చు?
1) జ్ఞానం
2) వినియోగం
3) అభిరుచి
4) అవగాహన
103. ‘పట్టణ స్థానిక స్వపరిపాలనకు, గ్రామీణ స్థానిక స్వపరిపాలనకు ఉన్న తేడాలను తెలపండి’ ప్రశ్న ఏ లక్ష్య సాధనకు ఉద్దేశించింది?
1) నైపుణ్యం
2) అవగాహన
3) వినియోగం
4) జ్ఞానం
104. గోడపై చిత్రీకరించిన ఒక పటాన్ని చూసిన విద్యార్థి... దానిలోని తప్పులను తన ఉపాధ్యాయుని దృష్టికి తీసుకువచ్చాడు. ఈ చర్య ఏ లక్ష్య సాధనకు ఉదాహరణ?
1) అభిరుచి
2) వైఖరి
3) నైపుణ్యం
4) అవగాహన
105. రోడ్డు నియమాలు పాటించకపోతే ఏం జరుగుతుందో ఊహిస్తాడు అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
1) వినియోగం
2) అవగాహన
3) వైఖరి
4) నైపుణ్యం
సమాధానాలు
1) 2 | 2) 3 | 3) 4 | 4) 2 | 5) 3 | 6) 2 | 7) 3 | 8) 2 | 9) 3 | 10) 2 | 11) 2 | 12) 2 | 13) 4 | 14) 2 | 15) 2 |
16) 2 | 17) 3 | 18) 1 | 19) 2 | 20) 2 | 21) 2 | 22) 2 | 23) 2 | 24) 4 | 25) 2 | 26) 1 | 27) 3 | 28) 2 | 29) 1 | 30) 2 |
31) 3 | 32) 2 | 33) 1 | 34) 2 | 35) 2 | 36) 2 | 37) 2 | 38) 2 | 39) 1 | 40) 2 | 41) 2 | 42) 3 | 43) 2 | 44) 2 | 45) 3 |
46) 2 | 47) 2 | 48) 4 | 49) 3 | 50) 3 | 51) 2 | 52) 2 | 53) 4 | 54) 2 | 55) 3 | 56) 2 | 57) 1 | 58) 2 | 59) 4 | 60) 1 |
61) 2 | 62) 3 | 63) 2 | 64) 3 | 65) 2 | 66) 2 | 67) 1 | 68) 2 | 69) 2 | 70) 3 | 71) 3 | 72) 2 | 73) 3 | 74) 3 | 75) 3 |
76) 2 | 77) 4 | 78) 3 | 79) 1 | 80) 4 | 81) 3 | 82) 4 | 83) 3 | 84) 4 | 85) 1 | 86) 3 | 87) 2 | 88) 1 | 89) 4 | 90) 3 |
91) 3 | 92) 4 | 93) 1 | 94) 4 | 95) 3 | 96) 1 | 97) 2 | 98) 1 | 99) 4 | 100) 3 | 101) 3 | 102) 2 | 103) 2 | 104) 4 | 105) 1 |
Published date : 10 Dec 2014 05:51PM