Skip to main content

వీశాట్‌–2021 ఫేజ్‌–1 ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల

చేబ్రోలు (పొన్నూరు): విజ్ఞాన్‌ యూనివర్సిటీలో బీటెక్, బీఫార్మసీ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీశాట్‌–2021 ఫేజ్‌–1 (విజ్ఞాన్‌ స్కోలాస్టిక్‌ యాప్టిట్యూడ్‌ టెస్ట్‌)కు అనూహ్య స్పందన లభించిందని విజ్ఞాన్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ వీసీ ఎం. వై.ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు.
వీశాట్‌–2021 ఫేజ్‌–1 ప్రవేశ పరీక్ష ఫలితాలను బుధవారం ఆయన విడుదల చేశారు. వీశాట్‌లో ప్రతిభ కనబరిచిన వారికి స్కాలర్‌షిప్‌ను నాలుగేళ్ల పాటు అందిస్తామని వెల్లడించారు. వీశాట్‌ ఫేజ్‌–2 ప్రవేశ పరీక్షలను జూన్‌ 23 నుంచి జూలై 25 వరకు నిర్వహించనున్నామని తెలిపారు.

తొలి పది ర్యాంకులు వీరికే..
విజ్ఞాన్‌ యూనివర్సిటీ డీన్‌ (అడ్మిషన్స్‌) డాక్టర్‌ కె.వి.కృష్ణకిషోర్‌ మాట్లాడుతూ వీశాట్‌లో తొలి పది ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. మొదటి పది ర్యాంకులను వరుసగా చందం విష్ణు వివేక్‌ (రాజమం డ్రి), చాకలి ఉదయ్‌కిరణ్‌ (విజయవాడ), కె. జితేంద్ర (ఎమ్మిగనూరు), సింగారెడ్డి అజయ్‌భరత్‌రెడ్డి (విజయవాడ), మొండి ఉజ్వల్‌ప్రభాస్‌ (కాకినాడ), భూమిరెడ్డి జస్వంత్‌కుమార్‌రెడ్డి(కడప), మంచిన కార్తీక్‌ (చాట్రాయి, కృష్ణా జిల్లా), పి.హరిహరసుదన్‌ (భీమవరం), ఎం.రామ్‌నారాయణ (గుంటూరు), కె.హేమంత్‌కుమార్‌ (వెంకటగిరి) సాధించారు.
Published date : 24 Jun 2021 04:48PM

Photo Stories