RGUKT: ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ ప్రారంభం.. కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి..
Sakshi Education
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2023–24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ జూలై 20న ప్రారంభమైంది.
నూజివీడు ట్రిపుల్‌ఐటీకి 1,040 మంది విద్యార్థులను ఎంపిక చేయగా... తొలిరోజు కౌన్సెలింగ్‌కు రావాలని 550 మందికి కాల్‌లెటర్లు పంపించారు. వారిలో 481 మంది హాజరవగా.. అందరికీ సీట్లు కేటాయించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందిన తొలి 30 మందికి అడ్మిషన్ పత్రాలను ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి అందజేశారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం 20 కౌంటర్లను ఏర్పాటు చేసి 70 మంది సిబ్బందిని నియమించారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూశారు. అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మేరుగ అర్జునరావు పర్యవేక్షించారు.
కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి.. :
- పదో తరగతి హాల్ టిక్కెట్,
- టెన్త్ మార్కుల జాబితా,
- టీసీ, కాండక్ట్ సర్టిఫికెట్,
- స్టడీ సర్టిఫికెట్(4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు),
- కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు,
- అభ్యర్థి, అతని తండ్రి లేదా తల్లివి రెండు పాస్‌పోర్ట్ ఫొటోలు,
- రేషన్ కార్డు,
- అభ్యర్థి ఆధార్ కార్డు,
- విద్యార్థులకు ఎవరికై నా బ్యాంకు రుణం అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు,
- అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఎంప్లాయి ఇడెంటిటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్,
- అభ్యర్థి తండ్రి పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు ఐడీతో కౌన్సిలింగ్‌కు హాజరు కావాలి.
Published date : 21 Jul 2023 03:57PM