Skip to main content

POLYCET: పాలిసెట్‌లో సీట్లు భర్తీ వివరాలు

పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలిసెట్‌–2021 తొలివిడత అడ్మిషన్లలో 37,978 మందికి సీట్లు కేటాయించినట్లు సెట్‌ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు.
POLYCET
పాలిసెట్‌లో సీట్లు భర్తీ వివరాలు

ఈ మేరకు ఆయన అక్టోబర్‌ 12న పాలిసెట్‌ సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్‌ 18లోపు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని సూచించారు. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. స్పోర్ట్స్‌ కేటగిరీకి సంబంధించి 312 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి.. మెరిట్‌ జాబితాను శాప్‌కు పంపాల్సి ఉందన్నారు. అందువల్ల వారికి సీట్లు కేటాయించలేదని తెలిపారు.

259 కాలేజీలు.. 69,810 సీట్లు

పాలిసెట్‌లో 64,188 మంది అర్హత సాధించగా 42,910 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. వీరిలో 41,978 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. 41,036 మంది వెబ్‌ ఆప్షన్లను నమోదు చేశారు. రాష్ట్రంలో 259 కాలేజీలు ఉండగా వాటిలో 69,810 సీట్లు ఉన్నాయి. తొలి విడతలో 37,978 సీట్లు భర్తీ కాగా 31,832 సీట్లు మిగిలాయి. అత్యధికంగా ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి.

సీట్ల భర్తీ ఇలా..

కేటగిరీ

కాలేజీలు

కన్వీనర్‌ సీట్లు

భర్తీ

మిగులు

ప్రభుత్వ

84

16,934

13,672

3,262

ఎయిడెడ్‌

02

269

256

13

ప్రైవేటు

173

52,607

24,050

28,557

మొత్తం

259

69,810

37,978

31,832

చదవండి:

ఉద్యోగాలు భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 2వేలకు పైగా ఉద్యోగాలు..

Published date : 13 Oct 2021 04:09PM

Photo Stories