Skip to main content

ట్రిపుల్‌ ఐటీలో ఐఓటీ ఎక్స్‌పో–23

నూజివీడు: స్థానిక ట్రిపుల్‌ఐటీలో ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఎక్స్‌పో–23 ప్రారంభమైంది.
IoT Expo 23 at IIIT
ట్రిపుల్‌ ఐటీలో ఐఓటీ ఎక్స్‌పో–23

దీనిలో భాగంగా అకడమిక్‌ బ్లాక్‌–1లో విద్యార్థులు రూపొందించిన పలు మోడల్స్‌ను ప్రదర్శించారు. ఈసీఈ విద్యార్థులు 150కి పైగా మోడల్స్‌ను ప్రదర్శించగా ఏవో ప్రదీప్‌, డీన్‌ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు వెంకట్రావు, స్రవంతి, ఈసీఈ హెచ్‌ఓడీ పీ శ్యామ్‌, పలువురు అధ్యాపకులు మోడల్స్‌ను వీక్షించారు. మోడల్స్‌ను ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తయారు చేసిన మోడల్స్‌లో సురక్షిత ఎలక్ట్రిక్‌ వాహనాలు, సమర్ధవంతమైన నీటి నిర్వహణ, ఆటోమేటిక్‌ గ్రీన్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, వేలిముద్ర ఆధార ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ పరికరం, అటానమస్‌ అక్వాకల్చర్‌ మానిటర్‌, స్మార్ట్‌ అగ్రికల్చర్‌, అడ్వాన్స్‌డ్‌ ఫేస్‌ రికగ్నేషన్‌ లాక్‌ తదితర ప్రాజెక్టులున్నాయి.

చదవండి:

‘World Quantum Day’కు ట్రిపుల్‌ ఐటీ శాస్త్రవేత్తలు

Railway Recruitment : 1,100 రైల్వే ఉద్యోగాల భర్తీకి చర్యలు

Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్‌ విద్యార్థులకు మాక్‌టెస్టులు..

ఇంటర్‌ ఫలితాలు వివరాలు.. రోజుకు ఇన్ని సమాధాన పత్రాలకు మూల్యాంకన

Published date : 15 Apr 2023 04:47PM

Photo Stories