Skip to main content

NEET 2021 Guidance: నీట్‌.. టాప్‌ర్యాంకు... సాధించేలా!

- సెప్టెంబర్‌12న నీట్‌–యూజీ పరీక్ష నిర్వహణ - దేశ వ్యాప్తంగా 16లక్షల మందికి పైగా దరఖాస్తు - తెలుగు రాష్ట్రాల నుంచి 1.2 లక్షల మంది అభ్యర్థులు - సెప్టెంబర్‌9 నుంచి అడ్మిట్‌కార్డ్‌డౌన్‌లోడ్‌
neet exam 2021
neet exam 2021

నీట్‌–యూజీ.. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య, వైద్య అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష! జాతీయ స్థాయిలో జరిగే నీట్‌కు లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరంతా తమ డాక్టర్‌కల సాకారం కోసం ఎంతోకాలంగా  శ్రమిస్తున్నారు! అలాంటి ప్రతిష్టాత్మక పరీక్ష నీట్‌2021.. సెప్టెంబర్‌12న దేశవ్యాప్తంగా జరుగనుంది. అంటే..పరీక్షకు మరో వారం రోజులæసమయం మాత్రమే మిగిలి ఉంది. ఇంతకాలం సాగించిన ప్రిపరేషన్‌ఒక ఎల్తైతే.. ఇప్పుడు పరీక్షకు ముందు చూపే ఏకాగ్రతే.. విజయంలో కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో.. సెప్టెంబర్‌12న జరగనున్న నీట్‌లో విజయానికి నిపుణుల సలహాలు.. 

విద్యార్థులు ఇంతకాలం నీట్‌సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాలతో కుస్తీ పట్టారు. ముఖ్యమైన అంశాలను అన్ని కోణాల్లో అధ్యయనం చేశారు. ఇప్పుడు పరీక్షకు ముందు వ్యూహాలు మార్చుకోవాలి. స్మార్ట్‌గా ఆలోచించి.. వేగంగా రివిజన్‌చేయాలి. మాక్‌టెస్టులు రాయాలి. కీలకాంశాలపై పట్టు బిగించాలి. నిండైన ఆత్మవిశ్వాసంతో పరీక్ష హాల్లో అడుగు పెట్టేలా సన్నద్ధమవ్వాలి. 


నీట్‌–2021.. ముఖ్యాంశాలు

 • మోడల్‌టెస్ట్‌లు, మాక్‌టెస్ట్‌లకు సమయం కేటాయించాలి.
 • రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
 • రెడీ రెకనర్స్, షార్ట్‌నోట్స్‌తో రివిజన్‌చేయడం ఉపయుక్తం.
 • పరీక్షకు రెండు రోజుల ముందుగానే డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి.
 • పరీక్ష రోజున వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 


మోడల్‌ టెస్ట్‌లు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో నీట్‌విద్యార్థులు ప్రధానంగా మోడల్‌టెస్ట్‌లు రాయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షకు రెండు రోజుల ముందు వరకు ప్రతిరోజు.. వాస్తవ పరీక్షను తల పించేలా నమూనా పరీక్షలు రాయాలి. రాసిన పరీక్ష ఫలితాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. ఎంత స్కోర్‌వచ్చింది.. నెగిటివ్‌మార్కులు ఎన్ని.. ఏఏ అంశాలకు సంబంధించి ప్రశ్నలకు సమా ధానం ఇవ్వలేకపోయారు వంటి అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. వాటికి అనుగుణంగా మరుసటి రోజు మోడల్‌టెస్ట్‌కు సన్నద్ధమవ్వాలి.


క్లిష్టమైన అంశాలైతే
మోడల్‌టెస్ట్‌లలో ఎక్కువ పొరపాటు సమాధా నాలు రాసిన సిలబస్‌అంశాలు తమకు ఇంకా క్లిష్టంగానే ఉన్నాయని భావిస్తే..వాటి గురించి ఆందోళన వీడాలి. వీటికి బదులు తమకు ఇప్పటికే బాగా వచ్చిన అంశాలపై మరింత పట్టు సాధిం చేందకు కృషిచేయాలి. ఒకవేళ తప్పుగా సమా ధానాలు ఇచ్చిన ప్రశ్నలకు లేదా సిలబస్‌అంశాలకు పరీక్షలో ఎక్కువ వెయిటేజీ ఉందని భావిస్తే.. వాటికి సంబంధించిన కాన్సెప్ట్‌లు, భావనలను, సూత్రాలను ఒకసారి అవలోకనం చేసుకోవాలి. 


ప్రతిరోజు పునశ్చరణ
అభ్యర్థులు ప్రస్తుత సమయంలో ప్రతిరోజు పున శ్చరణ కొనసాగించాలి. ఇందుకోసం తాము అప్ప టికే రాసుకున్న షార్ట్‌నోట్స్‌లేదా రెడీ రెకనర్స్, ముఖ్యమైన ఫార్ములాస్‌తో కూడిన పుస్తకాలను వినియోగించుకోవాలి. ఈ పునశ్చరణ కూడా సిలబస్‌వెయిటేజీ ఆధారంగా ఉండేలా చూసు కోవాలి. ఎక్కువ వెయిటేజీ ఉన్న అంశాలకు కొంత ఎక్కువ సమయం కేటాయించాలి. 


డయాగ్రమ్స్, ఫ్లో చార్ట్‌లు
ప్రస్తుత సమయంలో  పేరాల కొద్దీ ఉండే కంటెంట్‌చదవడం కంటే.. ఆయా కీలక అంశాలకు సంబంధించిన డయాగ్రమ్స్, ఫ్లోచార్ట్స్‌వంటి వాటిపై దృష్టిపెట్టాలి. ఫలితంగా అప్పటికే సదరు టాపిక్స్‌ను చదివిన అభ్యర్థులకు ఆయా డయా గ్రమ్స్, ఫ్లోచార్ట్‌లను చూడగానే దానికి సంబం ధించిన సమాచారం గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా బయాలజీ, ఫిజిక్స్‌సబ్జెక్ట్‌ల విషయంలో ఈ విధానం ఎంతో మేలు చేస్తుంది.


రెండు రోజుల ముందు
నీట్‌విద్యార్థులు తమ ప్రిపరేషన్, రివిజన్‌వం టివి పరీక్షకు రెండు రోజుల ముందే ముగించాలి. పరీక్షకు రెండు రోజుల ముందు నుంచి పరీక్ష హాల్లో అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలు, పరీక్షకు హాజరయ్యేందుకు అవసరమైన సన్నాహ కాలకు  సమయం కేటాయించాలి.
పరీక్షకు రెండు రోజుల ముందుగానే పరీక్షకు హాజరయ్యేందుకు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి. అడ్మిట్‌కార్డ్, పరీక్ష హాల్లోకి అడుగు పెట్టేందుకు అవసరమైన ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, పాస్ట్‌పోర్ట్‌సైజ్‌ఫోటో తదితర నిర్దేశిత డాక్యుమెంట్లను దగ్గరపెట్టుకోవాలి. 


9నుంచి అడ్మిట్‌కార్డ్‌
ముఖ్యంగా అడ్మిట్‌కార్డ్‌ను సాధ్యమైనంత త్వరగా డౌన్‌లోడ్‌చేసుకోవాలి. లేదంటే చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు లేదా సదరు వెబ్‌సైట్‌కు ట్రాఫిక్‌పెరిగి.. ఓపెన్‌కాకపోవడం వంటివి ఆందోళనకు గురిచేస్తాయి. నీట్‌–2021 అభ్యర్థులకు ఈ నెల 9వ తేదీ నుంచి అడ్మిట్‌కార్డ్‌డౌన్‌లోడ్‌సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ తేదీని గుర్తు పెట్టుకొని వెంటనే అడ్మిట్‌కార్డ్‌డౌన్‌లోడ్‌చేసుకోవాలి. వివరాలు సరిచూసుకోవాలి.


పరీక్ష కేంద్రంపై స్పష్టత
విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రం వివరాలు, చిరునామాను ముందుగానే తెలుసు కోవాలి. వీలైతే పరీక్షకు రెండు రోజుల ముందుగానే పరీక్ష కేంద్రాన్ని చూసి రావడం మేలు. ఫలితంగా పరీక్ష రోజున ఏ సమయానికి బయలుదేరాలో స్పష్టత లభిస్తుంది. ఇప్పటికే ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. అభ్యర్థులు తమ అప్లికేషన్‌నెంబర్, పుట్టిన తేదీ వివరాలను పొందుపరిచి..తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని తెలుసుకోవచ్చు.


ఓఎంఆర్‌షీట్‌
అభ్యర్థులు పరీక్ష హాల్లో ఓఎంఆర్‌షీట్‌ను నింపే టప్పుడు అనుసరించాల్సిన నిబంధనలను కూడా నీట్‌నిర్వాహక సంస్థ ఎన్‌టీఏ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యర్థులు వాటిని పరీక్షకు ఒక ట్రెండు రోజుల ముందే చదివి స్పష్టత తెచ్చు కోవాలి. ఓఎంఆర్‌షీట్‌నింపేందుకు అవసరమైన పెన్, పెన్సిల్‌వంటి వాటిని సిద్ధంగా ఉంచు కోవాలి.


పరీక్ష ముందు రోజు
పరీక్షకు ముందు రోజు పూర్తిగా పరీక్ష హాల్లో అనుస రించాల్సిన వ్యూహాలు, పరీక్షకు హాజరయ్యేందుకు అవసరమైన అంశాలపైనే దృష్టి పెట్టాలి. అంతే తప్ప ఆ రోజు కూడా ప్రిపరేషన్‌సాగిద్దాం లేదా మోడల్‌టెస్ట్‌కు హాజరవుదాం.. అనే ఆలోచన సరికాదు. అవసరం అనుకుంటే.. రెడీ రెకనర్స్‌ను ఒకసారి పై పైన చూసుకోవచ్చు. 


ఒత్తిడి లేకుండా.. ప్రశాంతంగా
పరీక్షకు ముందు రోజు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. తేలికైన ఆహారం తీసు కోవాలి.  పరీక్షకు ముందు రోజు సరిగా నిద్ర పోకుంటే.. అది పరీక్ష హాల్లో ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి బాగా నిద్ర పోవాలి. అదేవిధంగా యోగ, ధాన్యంతోపాటు రిలాక్సేషన్‌టెక్నిక్స్‌ను పాటిస్తూ.. ప్రశాంత చిత్తంతో పరీక్షకు హాజరవ్వాలి. 


పరీక్ష రోజు
పరీక్ష రోజున వీలైనంత త్వరగా పరీక్ష హాల్‌కు చేరుకునేలా చూసుకోవాలి. పరీక్ష హాల్లోకి అనుమ తించే సమయాని కంటే కనీసం గంట ముందుగానే అక్కడకు చేరుకోవాలి. ఒకవేళ పరీక్ష కేంద్రం ఇంటికి బాగా దూరంగానో లేదా వేరే ప్రాంతంలోనో ఉంటే.. ఒకరోజు ముందుగానే చేరుకోవడం మేలు. కోవిడ్‌ప్రొటోకాల్‌కు అను గుణంగా విద్యా ర్థులు నిబంధనలు పాటించాలని పేర్కొం టున్నారు. కాబట్టి అందుకు అనుగుణంగా అసరమైనవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. డ్రెస్‌కోడ్, ఇతర నిషేధిత వస్తువుల విషయంలో ఎన్‌టీఏ సూచనలకు అనుగు ణంగా వ్యవహరించాలి.


పరీక్ష హాల్లో.. ఇలా

 • పరీక్ష హాల్లోకి ప్రవేశించాక.. అసలైన యుద్ధం మొదలైనట్లే! అభ్యర్థులు సమాధానాలు ఇచ్చేం దుకు తొందరపడకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలి. 
 • ఆన్సర్‌ బుక్‌లెట్‌పై ముద్రించిన నిబంధనలను క్షుణ్నంగా చదవాలి.
 • తొలుత ప్రశ్న పత్రం ఆశాంతం చదివేందుకు కనీసం పది, పదిహేను నిమిషాలు కేటాయించాలి. 
 • ముందుగా సులభంగా అనిపించిన ప్రశ్నలకు, తర్వాత దశలో ఓ మోస్తరు క్లిష్టత ప్రశ్నలకు, చివరగా క్లిష్టంగా భావించే ప్రశ్నలకు సమాధా నాలు గుర్తించాలి.
 • ఓఎంఆర్‌షీట్‌లో బ్లూ లేదా బ్లాక్‌పెన్‌తో ఆప్షన్‌ను బబుల్‌చేయాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని మార్చుకోవడానికి కుదరదు. కాబట్టి ఒక ఆప్షన్‌ను నింపే ముందు.. ప్రశ్న సంఖ్య, మీరు సమాధానంగా భావిస్తున్న ఆప్షన్‌ను సరిచూ సుకోవడం ఎంతో అవసరం. 
 • సమాధానాలు గుర్తించడం పూర్తి చేశాక.. చివర్లో ఒకసారి వాటిని సమీక్షించుకోవాలి.


‘నెగెటివ్‌’ తక్కువగా ఉండేలా

 • ఈసారి ఎన్‌టీఏ నీట్‌ర్యాంకుల కేటాయింపు విషయంలో కీలకమైన మార్పులు చేసింది.  ముఖ్యంగా ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కు లు వస్తే.. నెగెటివ్‌మార్కులు తక్కువగా ఉన్న వారికి ర్యాంకు కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వ నుంది. కాబట్టి తెలియని ప్రశ్నలకు సమా« దానా లు ఇచ్చేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహ రించాలి.
 • ర్యాంకుల కేటాయింపులో.. టై బ్రేకింగ్‌లో మొట్ట మొదట బయాలజీలో ఎక్కువ మార్కులు వచ్చి న వారిని, ఆ తర్వాత ఫిజిక్స్‌లో ఎక్కువ మార్కు లు వచ్చిన వారిని;  చివరగా కెమిస్ట్రీలో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని గుర్తించి.. ర్యాంకు కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తారు. ఒక వేళ ఇలా అన్ని సబ్జెక్ట్‌లలోనూ ఇద్దరు అభ్యర్థు లకు సమాన మార్కులు వస్తే.. నెగెటివ్‌మార్కులు తక్కువగా ఉన్న వారికి ముందుగా ర్యాంకు కేటాయిస్తారు.


నీట్‌–2021 పెరిగిన పోటీ

 • నీట్‌–2021 పరీక్షకు దరఖాస్తుల సంఖ్య పెరగింది. ఎన్‌టీఏ సమాచారం ప్రకారం–ఈ ఏడాది 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. 
 • ఆంధ్రప్రదేశ్‌నుంచి 59,951 మంది; తెలంగాణ నుంచి 59,061 మంది దరఖాస్తు చేసుకున్నారు. 
 • పదమూడు భాషల్లో నీట్‌పరీక్ష నిర్వహిస్తు న్నప్పటికీ.. దాదాపు 70 శాతం మందికిపైగా అభ్యర్థులు ఇంగ్లిష్‌మీడియంలో పరీక్ష రాసేం దుకే మొగ్గు చూపడం గమనార్హం. 


రివిజన్‌కు ప్రాధాన్యం
ప్రస్తుత సమయంలో రివిజన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా మోడల్‌టెస్ట్‌లు, మాక్‌టెస్ట్‌లకు హాజరు కావాలి. ఆయా అంశాలకు ఉన్న వెయిటేజీ ఆధారంగా రివిజన్‌కు సమయం కేటాయించాలి. 
– కె. వెంకట్,నీట్‌–2020 13వ ర్యాంకు

నీట్‌–2021 సమాచారం
పరీక్ష తేదీ: సెప్టెంబర్‌12
అడ్మిట్‌కార్డ్‌డౌన్‌లోడ్‌సదుపాయం: సెప్టెంబర్‌9 నుంచి
వివరాలకు వెబ్‌సైట్‌: https://neet.nta.nic.in
 

Published date : 08 Sep 2021 07:08PM

Photo Stories