NEET 2021: నీట్ స్టేట్ ర్యాంకులు విడుదల
నీట్ బోర్డు నుంచి రాష్ట్ర ర్యాంకుల వివరాలు నవంబర్ 22 రాత్రికి యూనివర్సిటీకి వచ్చాయి. వాటిని క్రోడీకరించి నవంబర్ 23న మధ్యాహ్నం 12 గంటలకు స్టేట్ ర్యాంకులను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆ ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టనున్నారు. నీట్ ఫలితాలు వెల్లడించి 20 రోజులు కావస్తుండగా, కొన్ని సాంకేతిక పరమైన అంశాలతో స్టేట్ ర్యాంకులు ప్రకటించడంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం స్టేట్ ర్యాంకులు ప్రకటిస్తుండటంతో ఇక అడ్మిషన్ల ప్రక్రియకు త్వరలోనే శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.
నీట్ కటాఫ్ స్కోర్ వివరాలు:
జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 50 పర్సంటైల్, కట్ ఆఫ్ స్కోర్: 138
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40 పర్సంటైల్, కట్ ఆఫ్ స్కోర్: 108
పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 పర్సంటైల్, కట్ ఆఫ్ స్కోర్: 122
>> నీట్ 2021 స్టేట్ ర్యాంకుల కోసం క్లిక్ చేయండి
చదవండి:
EWS: ఈడబ్ల్యూఎస్ కోటా.. ఎంబీబీఎస్‌కు కేటాయించిన సీట్లు సంఖ్య!