NEET: నీట్ రాష్ట్ర ర్యాంకులు మరింత ఆలస్యం
నీట్‌లో ఉత్తీర్ణులైన వారి సమాచారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) నుంచి నవంబర్ 16న ఉదయం అందినట్లు చెప్పారు. అయితే సాంకేతిక లోపాల వల్ల అర్హుల సమాచారం నిక్షిప్తం చేసి పంపిన డివైజ్ ఓపెన్ కాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 17న ఎన్ టీఏకు మెయిల్ పంపుతామని ఈ మొత్తం ప్రక్రియ జరిగి రాష్ట్ర ర్యాంకులు కేటాయించడానికి మరో నాలుగైదు రోజుల సమ యం పట్టొచ్చని వివరించారు. సాంకేతిక అవరోధాలు ఏర్పడకపోయి ఉంటే నవంబర్ 16న రాత్రి లేదా నవంబర్ 17న నోటిఫికేషన్ విడుదలయ్యేదన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్ 12న నీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి 59 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. నవంబర్ 2వ తేదీన ఎన్ టీఏ విద్యార్థుల ఈ–మెయిల్, ఫోన్ నంబర్‌లకు ర్యాంక్ కార్డులను పంపింది. జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది? సీటు వస్తుందా? లేదా? అని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చదవండి:
Ritika : పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది..కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు..
EWS: ఈడబ్ల్యూఎస్ కోటా.. ఎంబీబీఎస్‌కు కేటాయించిన సీట్లు సంఖ్య!
NEET Results: నీట్ ఫలితాల్లో గిరిజన విద్యార్థుల హవా: గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల మంత్రి