KNRUHS NEET 2nd Round MBBS Seat Allotments: కళాశాలల వారీగా కేటాయింపు జాబితా ఇదే!
రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. 2023–24లో 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లు, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి.
ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50శాతం సీట్లను కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రైవేటులో మిగిలినవాటిలో బీ కేటగిరీ కింద 1,640 సీట్లను, ఎన్నారై కోటాలో 700 సీట్లను భర్తీ చేస్తారు. బీ కేటగిరీలో 85శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే కేటాయిస్తుండటంతో మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయి. ఇక ఎన్నారై కోటాలో సీట్లు ఎక్కువగానే ఉన్నా.. వాటికి ఫీజులు బీ కేటగిరీ ఫీజుల కంటే రెట్టింపుగా ఉంటాయి. అంటే ఎన్నారై కోటా సీటు ఫీజు ఏడాదికి రూ.23 లక్షలు, అంతకుమించి ఉంటుంది. కాలేజీలను బట్టి ఇది మారుతుంది.
TS NEET MBBS 2023 Round-2 Cutoff Ranks | ||||
Category | General | Marks | Women | Marks |
Open | 159928 | 453 | 159419 | 453 |
EWS | 142345 | 468 | 126240 | 483 |
SC | 243666 | 391 | 242008 | 392 |
ST | 228912 | 401 | 227108 | 402 |
BC-A | 256690 | 383 | 256783 | 383 |
BC-B | 182579 | 435 | 181777 | 435 |
BC-C | 262999 | 379 | 266945 | 377 |
BC-D | 175332 | 440 | 174334 | 441 |
BC-E | 184057 | 433 | 182953 | 434 |
Minority | 182683 | 435 | 172532 | 442 |