యువత, ప్రతిభ కలిగిన ఆవిష్కర్తలకు...కేంద్రం రూ.25 లక్షల సాయం
Sakshi Education
న్యూఢిల్లీ: వినూత్నమైన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే స్టార్టప్ సంస్థలకు నిధుల సాయం అందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ ‘చునౌతి’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రకటించింది.
ప్రత్యేకంగా ద్వితీయ శ్రేణి పట్టణాలే లక్ష్యంగా స్టార్టప్‌లు, సాఫ్ట్ వేర్ ఉత్పత్తులను ఈ కార్యక్రమం కింద ప్రోత్సహించనుంది. ఇందుకోసం మూడేళ్లలో రూ.95 కోట్లు ఖర్చు చేయనుంది. ఎంపిక చేసిన విభాగాల్లో పనిచేసే 300 వరకు స్టార్టప్ లను ఎంపిక చేసి, ఒక్కోదానికి రూ.25 లక్షల వరకు నిధుల సాయంతోపాటు, ఇతర సౌకర్యాలను కల్పించనున్నట్టు కేంద్ర ఐటీ శాఖ ఆగస్టు 28న ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేకంగా ద్వితీయ శ్రేణి పట్టణాల(టైర్-2)పై దృష్టి సారించే స్టార్టప్‌లు, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ప్రోత్సహించే చునౌతి తదుపరి దశ స్టార్టప్ చాలెంజ్ పోటీని మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించినట్టు తెలిపింది. యువత, ప్రతిభ కలిగిన ఆవిష్కర్తలు ముందుకు వచ్చి చునౌతి కార్యక్రమం కింద ఆఫర్ చేస్తున్న ప్రయోజనాలను అందుకోవాలని, నూతన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ఆవిష్కరించాలని మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు.
పూర్తి సహకారం..: ఎడ్యు టెక్ (విద్యా రంగం), అగ్రి టెక్ (వ్యవసాయ రంగం), ఫిన్ టెక్ (ఫైనాన్షియల్ రంగం) సొల్యూషన్లను సామాన్యులు, సరఫరా వ్యవస్థ, సరుకు రవాణా, రవాణా నిర్వహణ, మౌలిక సదుపాయాలు తదితర విభాగాల్లో అందించే స్టార్టప్ లను ఈ పోటీలో భాగంగా ఆహ్వానిస్తారు. మెడికల్ హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్స్, ప్రివెంటివ్, సైకలాజికల్ కేర్, ఉద్యోగ, నైపుణ్య, లింగ్విస్టిక్ టూల్స్, టెక్నాలజీలను అందించే స్టార్టప్‌లకూ ప్రవేశం ఉంటుంది. ఎంపికై న స్టార్టప్ లకు దేశవ్యాప్తంగా ఉన్న సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ల నుంచి పూర్తి సహకారం అందుకోవచ్చు. ఇంక్యుబేషన్ సౌకర్యాలు(కంపెనీలకు ప్రాథమిక దశలో సహకారం), మార్గదర్శనం, సెక్యూరిటీ టెస్టింగ్ సౌకర్యాలు, వెంచర్ క్యాపిటల్ సంస్థల ద్వారా మరింత నిధుల సాయం, పరిశ్రమలతో అనుసంధానం, పేటెంట్ లకు సంబంధించి సహకారం కూడా లభిస్తుంది.

Published date : 29 Aug 2020 03:54PM