Skip to main content

యూజీసీ వేతనాల మేరకు పెన్షన్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ, యూనివర్సిటీల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన అధ్యాపకులకు పెరిగిన యూజీసీ వేతనాల ఆధారంగా పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు జనవరి 2 (గురువారం)నవిద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ద న్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన యూజీసీ స్కేళ్ల ప్రకారం రిటైర్డ్ అధ్యాపకులకు కూడా అదే తేదీ నుంచి పెన్షన్ వర్తింప జేస్తున్నట్లు అందులో పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని 6 వేలమంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో 3 వేల మంది డిగ్రీ కాలేజీ, 1,500 మంది వర్సిటీ, మిగిలిన వారు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీ రిటైర్డ్ అధ్యాపకులున్నారు. ఒక్కో పెన్షనర్‌కు సీనియార్టీ ఆధా రంగా సగటున రూ.8 వేల నుంచి 15 వేల వరకు పెన్షన్‌లో అదనపు పెరుగుదల లభించనుంది. 2020 ఏప్రిల్ 1న వచ్చే మార్చి నెల పెన్షన్‌ను పెరుగుదలతో కలుపుకొని నగదు రూపంలో పొందనున్నారు. 01.06.2016 నుంచి 29.02.2020 వరకు పెరిగిన పెన్షన్ బకాయిలను 4 విడతల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వచ్చే జూన్‌లో మొదటి విడ త, ఆగస్టులో రెండు, అక్టోబర్‌లో మూడు, డిసెంబర్‌లో నాలుగో విడత ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఆర్థిక భారమైనా...
రిటైర్డ్ అధ్యాపకులకు యూజీసీ పెరిగిన వేతనాల ప్రకారం పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ చెల్లింపులకే ఆమోదం తెలపడంపై ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, రిటైర్డ్ అధ్యాపకుల సంఘం నేత లు విద్యాసాగర్, పుల్లయ్య తదితరులు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మాంద్యంలోనూ తమ పట్ల సానుకూల నిర్ణ యం తీసుకోవడం హర్షణీయమని, దీనికి సహకరించిన అధికారులు జనార్దన్‌రెడ్డి, రామకృష్ణారావు, మంత్రి సబితారెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Published date : 03 Jan 2020 03:32PM

Photo Stories