యోగి వేమన వర్సిటీకి ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ గుర్తింపు
Sakshi Education
వైవీయూ (వైఎస్‌ఆర్ జిల్లా): కడప పరిధిలో ఏర్పాటైన యోగివేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖతో ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వారి రెండు సర్టిఫికెట్లను సొంతం చేసుకుంది. నాణ్యత పాటించడంలో, పర్యావరణ పరిరక్షణలో వైవీయూ కృషికి గుర్తింపునిస్తూ ఏక్యూసీ మిడిల్ ఈస్ట్ సంస్థ ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌వో సర్టిఫికెట్లను అందజేసింది. అకడమిక్‌గా క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టం ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న విభాగంలో ఉన్న సంస్థలకు ఇచ్చే ఐఎస్‌వో 9001: 2015 సర్టిఫికెట్ కేటాయించింది. పర్యావరణ నిర్వహణ విధానం విభాగంలోనూ వైవీయూకు ఐఎస్‌వో 14001: 2015 సర్టిఫికెట్లు లభించాయి. వీటితో పాటు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు నైపుణ్యాలు అందించడం, సాంకేతికతను, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇంటర్న్‌షిప్, ప్లేస్‌మెంట్ కల్పించడం తదితర విద్యాభివృద్ధి కోసం చేస్తున్న కృషిని గుర్తిస్తూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ విద్యామండలి చైర్మన్ డాక్టర్ డబ్ల్యూ.జి.ప్రసన్నకుమార్ ప్రత్యేక ప్రశంసాపత్రం పంపారు.
Published date : 23 Nov 2020 02:16PM