వ్యవసాయ వర్సిటీకి కృషి శిక్షా సమ్మాన్ అవార్డు
Sakshi Education
ఏజీ యూనివర్సిటీ: జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది.
వరిలో తడి-పొడి విధా నాన్ని రైతుల పొలాల్లో అమలుచేసి విసృ్తత ప్రచారం కల్పిం చినందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ సమృద్ధి కృషి శిక్షా సమ్మాన్ అవార్డు ఇచ్చింది. మహీంద్రా సమృద్ధి ఇండియా-2020 అవార్డు ప్రదానోత్సవంలో భాగంగా గురువారం వ్యవసాయ విశ్వవిద్యా లయం పరిపాలన భవనంలో ఆ సంస్థ ప్రతి నిధి కె.వంశీ కృష్ణారెడ్డి విశ్వవిద్యాలయ వీసీ ప్రవీణ్‌రావుకు అవార్డు అందజేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల శాస్త్ర వేత్తలు 10 జిల్లాలోని 370 మంది రైతు పొలాల్లో తడి-పొడి విధానానికి ప్రాచుర్యం కల్పించారని పేర్కొన్నారు. ఈ విధానం అమలు చేయడం వల్ల 4% అధిక దిగుబడితో పాటు 24% నీటి ఆదా అయినట్లు నీటి సాంకేతిక పరి జ్ఞాన కేంద్రం అధ్యయనంలో పేర్కొన్నారు.
Published date : 12 Feb 2021 04:05PM