Skip to main content

‘వర్క్ ఫ్రమ్ హోమ్'లో ఆదాయమెంతో తెలుసా..!

ముంబై: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మెజారిటీ కంపెనీలు 'వర్క్ ఫ్రమ్ హోమ్'(ఇంటి నుంచే పని) వెసలుబాటు కల్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ద్వారా ఏ మేరకు లబ్ధి చేకురుతుందో ఏడబ్యుఎఫ్‌ఐఎస్‌ సర్వే నిర్వహించింది. కాగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే సగటు భారతీయుడు నెలకు రూ.5,520 వరకు కూడబెడతాడని సర్వే తెలిపింది. అయితే 74శాతం ఉద్యోగులు దూర ప్రాంతాలలో బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధమని తెలిపారు. 20శాతం ఉద్యోగులు నెలకు రూ.5,000నుంచి రూ.10,000 వరకు ఆదా చేయగలమని అన్నారు.

అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ద్వారా కంపెనీలకు 44 రోజుల అదనపు పని దినాలు మిగిలే అవకాశం ఉందని ఏడబ్యుఎఫ్‌ఐఎస్‌ సీఈఓ అమిత్‌ రమానీ తెలిపారు. ఈ సర్వే జూన్‌ నుంచి జులై నెలలో 7 మెట్రో నగరాలలో నిర్వహించారు. ఈ సర్వేలో 1,000మంది ఉద్యోగులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. మరోవైపు 43 శాతం ఉద్యోగులు దూర ప్రాంతాలలో పనిచేస్తుండడం కొంత ఇబ్బందికరమని తెలిపారు. అయితే కంపెనీలు దీర్ఘకాలికంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ ద్వారా ఉద్యోగులకు వెసలుబాటు ఇవ్వదలుచుకుంటే, పటిష్టమైన పాలసీలను రూపొందించాలని సర్వే సూచించింది.
Published date : 01 Sep 2020 05:57PM

Photo Stories