వీఆర్‌ఏలకు సీఎం కేసీఆర్ చెప్పిన గుడ్‌న్యూస్ ఇదే
Sakshi Education
సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)లకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభవార్త అందించారు.
ఉద్యోగులకు పే స్కేల్ అమలుతో పాటు పదవీ విరమణ కోరితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్సిస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతంలో వీఆర్‌ఏలు ఎంతో సేవ చేస్తున్నారని గుర్తుచేశారు. వీరిలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా వీళ్లు అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో వారు కోరుకుంటే వాళ్ల ఇంట్లో పిల్లలకు ఎవరికైనా వీఆర్‌ఏ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. శుక్రవారం కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా సీఎం అసెంబ్లీలో ప్రసంగించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వీఆర్‌ఏ సమస్యలపై ప్రశ్న సందర్భంగా సీఎం ఈ హామీ ఇచ్చారు. కాగా శుక్రవారం నూతన రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసందే.
Published date : 11 Sep 2020 07:43PM