Skip to main content

విద్యుత్ ఉద్యోగుల విభజన కేసు జనవరి 24 వ తేదీకి వాయిదా: సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: విద్యత్ ఉద్యోగుల విభజన వివాదంపై విచారణను సుప్రీంకోర్టు జనవరి 24వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ కేసు విచారించింది.
సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ 665 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిందని, ఈ కేటాయింపులు జనాభా దామాషా 58:42 నిష్పత్తి ప్రకారం లేవని ఏపీ డిస్కమ్‌ల తరఫు న్యాయవాది నీరజ్ వాదనలు వినిపించారు. ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు కేటాయించలేదని ప్రస్తావించారు. ఇది తమకు భారంగా పరిణమిస్తుందని వివరించారు. అయితే జస్టిస్ ధర్మాధికారి కమిషన్‌కు బదులు మరో కమిషన్ నియమించాలంటూ పిటిషన్ దాఖలు చేయడం సముచితంగా లేదని, దీనిని ఉపసంహరించుకుని నివేదికపై అభ్యంతరాలతో కూడిన పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిం చింది. మరోవైపు తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగుల తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ ధర్మాధికారి కమిటీ నివేదిక రాగానే తెలంగాణ డిస్కమ్ సంస్థలు ఉద్యోగులను రిలీవ్ చేశాయని, కానీ ఏపీ డిస్కం సంస్థలు విధుల్లో చేర్చుకోలేదని, జీతాల చెల్లింపుపై స్పష్టత లేదని, న్యాయం చేయాలని కోరారు. వచ్చేవారం విచారణ అనంతరం తగిన ఉత్తర్వులు జారీచేస్తామని ధర్మాసనం పేర్కొంది.
Published date : 18 Jan 2020 02:08PM

Photo Stories