విద్యాసంస్థల తాత్కాలిక బంద్ కారణంగా.. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల సెమిస్టర్లు పోస్ట్‌పోన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర అన్ని కోర్సుల సెమిస్టర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.
ప్రస్తుతం యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎం.ఫార్మసీ, ఎంటెక్ తదితర కోర్సులకు వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. విద్యా సంస్థల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలన్నింటినీ బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాం«దీ, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో కొనసాగుతున్న సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని మంగళవారం ఆయా వర్సిటీలు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్ అయింది. విద్యాసంస్థలనే మూసివేసినప్పుడు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తూ.. వాటిని కూడా వాయిదా వేసేలా వర్సిటీలకు ఆదేశాలివ్వాలని ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది. దీంతో అన్ని వర్సిటీల పరిధిలోని సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ప్రకటించారు.
ఆన్‌లైన్ తరగతులకు ఓకే...
మరోవైపు పరీక్షలను వాయిదా వేయాలని, ఆన్‌లైన్ తరగతులను మాత్రమే కొనసాగించాలని వర్సిటీల రిజిస్ర్టార్లకు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ ఇన్‌చార్జి కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ లేఖ రాశారు. ప్రస్తుతం అన్ని కోర్సుల పరీక్షలను వాయిదా వేస్తున్నామని, పరీక్షల నిర్వహణ తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఆయా యూనివర్సిటీలు వెల్లడించాయి.
చదవండి: ఉపకార వేతనాల్లో ‘కోత’.. పోస్టుమెట్రిక్ విద్యార్థులందరికీ ఒకే తరహా స్కాలర్‌షిప్‌లు..

Published date : 25 Mar 2021 04:33PM