విద్యాశాఖ పోస్టుల భర్తీ క్యాలెండర్ ఉగాది నాడు విడుదల: ఆదిమూలపు సురేష్
Sakshi Education
సాక్షి, అమరావతి: విద్యా శాఖలో ఈ ఏడాది భర్తీ చేయనున్న పోస్టుల క్యాలెండర్‌ను సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉగాది నాడు విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో మౌలిక వసతుల కల్పనకు వీలైనంత త్వరగా నిధులు విడుద ల చేయాలని సీఎం ఆర్థిక శాఖను ఆదేశించారని చెప్పారు. వచ్చేనెల 9న జగనన్న విద్యా దీవెన కింద ఫీజులు చెల్లిస్తామన్నారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో ఈ పథకం నగదు జమ చేస్తామన్నారు. దీనివల్ల 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గతేడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2.2 లక్షల నుంచి 2.7 లక్షలకు పెరిగాయన్నారు. ఆయన శుక్రవారం సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు విద్యార్థులకు ఉద్యోగాలు లభించేలా విద్యాబోధన చేయిస్తామన్నారు. అక్రమాలకు పాల్పడే అటానమస్ కాలేజీలు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే..
అటానమస్ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందడం లేదు..
రాష్ట్రంలో పలు యూనివర్సిటీల పరిధిలో 109 అటానమస్ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో సిలబస్, ప్రశ్నపత్రాల రూపకల్పనతోపాటు మూల్యాంకనం వంటివి అవే సొంతంగా చేపడుతున్నాయి. దీనివల్ల నాణ్యమైన విద్య అందడం లేదని గుర్తించాం. అంతేకాకుండా ప్రభుత్వ రాయి తీలు పొందుతూ.. అటానమస్ స్టేటస్‌ను అడ్డం పెట్టుకుని కొన్ని అక్రమాలకు పాల్పడుతు న్నాయి. ఇకపై అటానమస్ కాలేజీలు సొంతంగా ప్రశ్నపత్రాలు రూపొందించుకోవడం కుదరదు. వాటిలో నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వల్లే ఉద్యోగాలు రావడం లేదు. డిగ్రీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి అటానమస్ కాలేజీల్లో ఆడిట్ చేపట్టి, పరీక్ష విధానంలో సమూల మార్పులు తీసుకొస్తాం. ఇక నుంచి డిగ్రీ తరగతులకూ అప్రెంటీస్ విధానం అమలు చేస్తాం. ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వర వర్సిటీలు, ఆర్జీయూకేటీ, జేఎన్టీయూ– కాకినాడ, అనంతపురంల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు.

Published date : 27 Mar 2021 02:56PM