Skip to main content

విద్యార్థులు ఒత్తిడికి గురికావద్దు..

ప్రత్తిపాడు: ఒత్తిడికి గురికాకుండా.. అకడమిక్ క్యాలెండర్‌ను అనుసరించాలని విద్యార్థులకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డెరైక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి సూచించారు.
ఏప్రిల్ వరకు సమ్మేటివ్‌లు ఉండవని వెల్లడించారు. విద్యా సంవత్సరం చివర్లో ఒకే ఒక్క ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. జగనన్న విద్యా కానుక వారోత్సవాల్లో బుధవారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందించిన విద్యా కానుక కిట్లు, బ్యాగులు, పుస్తకాల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. రోజూ దినపత్రికలు, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలకు ఆటంకం కలగకుండా, విద్యార్థుల భవిష్యత్‌కు ఇబ్బంది లేకుండా అకడమిక్ క్యాలెండర్ రూపొందించామన్నారు.
Published date : 26 Nov 2020 01:34PM

Photo Stories