Skip to main content

విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన అవసరం: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తవని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో ఫిబ్రవరి 11 (సోమవారం)నవిద్యార్థులకు శుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల ని విద్యార్థులకు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని పేర్కొన్నారు. ఆహారం తీసుకునే ముందు, తిన్న తర్వాత చేతులను కడుక్కోవాలని విద్యార్థులకు సూచించా రు. మార్కెట్‌లో కొనే పండ్లను సైతం కడిగిన తర్వా త మాత్రమే తినాలని తెలిపారు. పరిశుభ్రత విషయంలో పాటించాల్సిన అంశాలపై విద్యార్థులను ప్రశ్నించారు. దానికి వారు చెప్పిన సమాధానాలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులకు బుక్స్, పెన్సిళ్లను బహుమతిగా అందజేశారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం గవర్నర్ రూ.1.50 లక్షలను విరాళంగా అందజేశారు.

తమిళ పాటకు ఫిదా..
‘ఓడి విలయాడు పాపా’అంటూ విద్యార్థులు ఆలపించిన తమిళ గీతానికి గవర్నర్ ఫిదా అయ్యారు. పాఠశాలలోని సంగీత ఉపాధ్యాయుడు వెంకట రమణారెడ్డి సమకూర్చిన బాణీలతో విద్యార్థులు ఈ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, జిల్లా విద్యా శాఖ అధికారి వెంకట నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.
Published date : 11 Feb 2020 01:18PM

Photo Stories