విద్యార్థులకు అన్నీ తానైన... ఉత్తమ టీచర్!
Sakshi Education
మెదక్ పట్టణానికి చెందిన కాముని రమేశ్ రెండు దశాబ్దాల క్రితం ఉపాధ్యాయవృత్తిలో అడుగుపెట్టారు.
కొల్చారం, పాపన్నపేట, హవేళిఘణాపూర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం హవేళిఘణాపూర్ మండలం బూర్గుపల్లి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ టీచర్ ఇక్కడికి వచ్చిన సమయంలో పాఠశాల పూర్తిగా శిథిలావస్థలో ఉంది. కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వర్షం కురిస్తే పాఠశాల పైకప్పు నుంచి నీళ్లు కారడం, మురికి కాల్వలు సక్రమంగా లేక దుర్గంధం వెదజల్లడం వంటి సమస్యలు ఇబ్బందికరంగా పరిణమించాయి. కిచెన్‌షెడ్ లేకపోవడంతో వంట చేసే సమ యంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే వారు. దీంతో ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
సొంత డబ్బులతో..కార్పొరేట్‌కు దీటుగా:
విద్యా ర్థుల అవస్థను దూరం చేసేందుకు సొంత డబ్బు రూ.1.75లక్షలు వెచ్చించడమే కాకుం డా మిత్రుల సహకారంతో మరో రూ. 3.37 లక్షల వరకు జమ చేశారు. ఈ మొత్తం రూ.5.12లక్షల డబ్బులతో పాఠశాల పై కప్పు మరమ్మతులు, విద్యార్థులకు మినరల్ వాటర్ అందించడానికి వాటర్ ప్లాంట్, కిచెన్ షెడ్డు, మురికి కాల్వల నిర్మాణం, విద్యార్థుల భోజనం అనంతరం చేతులు కడుక్కునేందుకు నల్లాల ఏర్పాటు తదితర వసతులు కల్పించారు. పాఠశాల ప్రాంగణంలో సరస్వతీమాత విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో ఒకప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడిన పాఠశాల ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలకు తీసిపోని విధంగా ఉంది.
భార్యసైతం...: కాముని రమేష్ భార్య కాముని మాధవి ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. తన భర్త అడుగు జాడల్లో నడుస్తున్న మాధవి రూ.2.80లక్షలు వెచ్చించి విద్యార్థుల సౌకర్యార్థం డ్యుయెల్ డెస్క్ బెంచీలను అందజేశారు.
పురస్కారాలు
రమేశ్ మాస్టారు ఇప్పటి వరకు మూడు పర్యాయాలు బెస్ట్ టీచర్ పురస్కారాలు అందుకున్నారు. రెండుసార్లు మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులు అందుకోగా, 2017లో జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు లభించింది.
సమస్యలు కలచివేశాయి
ఈ పాఠశాలకు వచ్చి నప్పుడు ఇక్కడి సమస్యలు మనసును కలిచివేశాయి. విద్యార్థులకు కనీసం తాగు నీటి సౌకర్యం కూడా లేదు. తోటి మిత్రుల సహకారంతోపాటు మాధవి చేయూతతో పాఠశాలలో పలు వసతులు కల్పించేందుకు కృషి చేశా. పాఠశాలను మరమ్మతులు చేయించడంతోపాటు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. విద్యార్థులకోసం నల్లాలు బిగించాం. వంట చేసే సమయంలో విద్యార్థులు అవస్థలు పడకుండా కిచెన్‌షెడ్ నిర్మించాం. దీంతో పరిసర గ్రామాల విద్యార్థులంతా పాఠశాలకు వస్తున్నారు.
- రమేష్, టీచర్

Published date : 31 Jan 2020 03:00PM