విద్యార్థుల ఇంటికే మధ్యాహ్న భోజనం సరుకులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మధ్యాహ్న భోజనం పొందుతున్న విద్యార్థులకు మధాహ్న భోజనం ఇంటికే అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే కేంద్రం దీనికి సంబంధించిన ఆదేశాలు జారీచేసింది. దీనికి అనుగుణంగా చేపట్టాల్సిన చర్యల పై విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. విద్యార్థులకు బియ్యం, కూరగాయలు, నూనెలు, కోడిగుడ్లకు సంబంధించిన వాటిని గ్రామ పంచాయతీల ద్వారా సరఫరా చేయాలని భావిస్తోంది. అది సాధ్యం కాని పరిస్థితుల్లో వాటికి వెచ్చించే మొత్తం డబ్బు ను పాఠశాలలు మూసివేసిన రోజులకు లె క్కించి విద్యార్థులకు అందజేయాలని భావిస్తోంది. అయితే విద్యా శాఖ పంపిన ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు 11,37,547 మంది, 6 నుంచి 8వ తర గతి వరకు 6,58,409 మంది, 9, 10 తరగతుల విద్యార్థులు 4,77,087 మంది ఉన్నా రు. ఒక్కొక్కరికి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.
ప్రస్తుతం విద్యార్థులపై వెచ్చిస్తున్నదిదే..
ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు రోజు 100 గ్రాముల బియ్యం, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకున్న విద్యార్థులకు 150 గ్రాముల బియ్యం ఇవ్వనున్నారు. వాటిని ఈనెల 16 నుంచి 31 వరకు లెక్కించి మొత్తంగా ఒక్కో విద్యార్థికి అందిస్తారు. లేదంటే సమానంగా డబ్బులు చెల్లించనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో భోజనం వండేందుకు కూరగాయలు, వంట నూనెల కింద మధ్యాహ్న భోజనం కార్మికులకు ఒక్కో విద్యార్థిపై చెల్లిస్తున్న రూ.4.48, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై చెల్లిస్తున్న రూ.6.71లను ఒక్కో విద్యారి్ధకి లెక్కించి ఇస్తారు. వారికి మూడు రోజులకు ఒకటి చొప్పున కోడిగుడ్లు అందించేందుకు ఒక్కో గుడ్డుకు రూ.4 చొప్పున చెల్లిస్తారు.

Published date : 24 Mar 2020 03:27PM