విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం: గవర్నర్ తమిళిసై
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యా సంస్థల్లో ప్రత్యక్షబోధనను ప్రారంభిస్తున్న నేపథ్యం లో విద్యార్థుల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు, రిజిస్ట్రార్లను రాష్ట్ర గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ ఆదేశించారు.
వర్సిటీలు, కాలేజీల్లో చేస్తున్న ఏర్పాట్లపై గవర్నర్ శుక్రవారం వర్చువల్ సమీక్ష నిర్వహించారు. బోధన సిబ్బంది భద్రతకు అవసరమైన చర్యలను చేపట్టాలన్నారు. విద్యాసంస్థలపై నమ్మకం కల్పించేలా చర్యలుండాలన్నారు.
కోవిడ్ నిబంధనలు పాటించాలి
భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా చర్యలు చేపట్టాలని, హ్యాండ్ వాష్ సదుపాయం కల్పించాలని, శానిటైజేషన్ వంటి కోవిడ్ నిబంధ నలు కచ్చితంగా పాటించాలని గవర్నర్ సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, మానసిక స్థితి, పౌష్టికాహారం వంటి విషయాల్లో గట్టి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని, తద్వారా వారికి సమస్యలు ఎదురైనప్పుడు, విపత్కర పరిస్థితుల్లో మెరుగైన సేవలు అందించేందుకు సాధ్యపడుతుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రత్యక్ష విద్యా బోధనకు పంపని పక్షంలో వారికి ప్రత్యేకంగా ఆన్‌లైన్ తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రత్యక్ష హాజరు తప్పనిసరి కాదని స్పష్టం చేశారు.
పూర్వ విద్యార్థులను భాగస్వాముల్ని చేయాలి
పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు వర్సిటీల వారీగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని వీసీలను గవర్నర్ ఆదేశించారు. గతేడాది గవర్నర్ ప్రారంభించిన ‘ఛాన్స్ లర్ కనెక్ట్స్ అల్యూమ్నీ’కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె సమీక్షించారు. వర్సిటీలకు ఆర్థిక సహకారం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు అందించేందుకు అనేకమంది ఉన్నారని, వారిని సంప్రదించి చర్యలు చేపట్టాలని సూచించారు.

Published date : 30 Jan 2021 02:52PM