Skip to main content

విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ ఇవ్వండి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
అలాగే బాల బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడాలని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్‌కు స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో స్వయంగా మాట్లాడుతానని, పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత గడువునివ్వాలని శ్రీరామ్ కోరారు. ఇందుకు హైకోర్టు అంగీకరిస్తూ విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
Published date : 11 Feb 2021 04:04PM

Photo Stories