Skip to main content

విద్యార్ధులు సాకులు చెప్పడం మానేయ్యాలి

చాలామంది పిల్లలు ఏమి అడిగినా సాకులు చెబుతుంటారు. అలా ఆ సమస్య నుంచి తాత్కాలికంగా బయటపడేందుకు యత్నిస్తుంటారు.
అలాంటి కథలు, సాకుల వల్ల అప్పటికి ఆ ఇబ్బంది తప్పిపోయినా భవిష్యత్తులో ఇబ్బందులు పడేది మాత్రం విద్యార్థులే. అంతేకాకుండా వారి తల్లిదండ్రులు కూడా. ఇలా సాకులు, కథలతో గడిపేవారు జీవితంలో ఎదగడం చాలా కష్టం. ఎదుటివారికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడమంటే మన కంటిని మనం పొడుచుకోవడమే. మనలను మనం మోసం చేసుకోవడమే. మనల్ని మనం మోసగించుకొంటే, మన కంటిని మనమే పొడుచుకొంటే నష్టపోయేది మనమే. ఉపాధ్యా యులు, గురువులు పెద్దవారు కనుక వారు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. విద్యార్థుల్లో కొంతమంది మాత్రం తప్పించుకొనే ధోరణితో ముందుకు సాగుతారు. దీనినే ఎస్కేపిజం అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. విద్యార్థుల భవితవ్యానికి ప్రమాదకరం. ఒకసారి కథలు, సాకులు, అబద్ధాలు చెప్పడం మొదలుపెడితే ఆ అలవాటు నుంచి బయటపడడం చాలా కష్టం. మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెత ఇందుకోసమే వచ్చింది. విద్యార్థి దశ అనేది జీవితంలో అత్యంత కీలకమైనది. ఉన్నతంగా ఎదగడానికి, పతనావస్థకు పడి పోవడానికి కూడా ఇదే మూలం. మంచి ఆలోచనలతో, పట్టుదలతో, చక్కని కార్యాచరణతో, తగినంత కృషితో ముందుకు సాగితే జీవితాంతం హాయిగా ఉండొచ్చు. అందుకు భిన్నంగా వ్యవహరించారో జీవితమంతా కష్టాల మయంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహమూ అవసరం లేదు.
Published date : 16 Mar 2020 05:49PM

Photo Stories