విద్యాకానుక కిట్లను సిద్ధం చేయండి: ఆదిమూలపు సురేష్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించే నాటికి జగనన్న విద్యా కానుక కిట్లు సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు.
జగనన్న విద్యా కానుకపై మంత్రి తన చాంబర్‌లో గురువారం సమీక్షించారు. యూనిఫాం క్లాత్, నోట్ పుస్తకాలు, బూట్లు, బెల్టు, బ్యాగులు సహా అన్నీ నిర్దేశించిన లక్ష్యం మేరకు స్కూళ్లకు కిట్ల రూపంలో చేర్చాలని చెప్పారు. కిట్లు భద్రపరిచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కిట్లను ఆయా పాఠశాలలకు సరఫరా చేసి ప్రధానోపాధ్యాయులు ఆధీనంలో వాటిని భద్రపరచాలని ఆదేశించారు. సమీక్షలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్ వి.చినవీరభద్రుడు, సమగ్ర శిక్ష ఎస్‌పీడీ వెట్రిసెల్వి పాల్గొన్నారు.
Published date : 14 Aug 2020 12:40PM