Skip to main content

విద్యాదీవెన, విద్యా వసతి లబ్ధిదారుల తుది జాబితాలకు ఆమోదం!

సాక్షి, అమరావతి: నవరత్నాల్లో భాగంగా విద్యార్థుల ఉన్నత చదువుల కోసం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఒక్కో విద్యార్థికి ఏటా వసతి, హాస్టల్ ఖర్చులకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయంబర్స్‌మెంట్), జగనన్న వసతి దీవెన (వసతి, హాస్టల్ ఖర్చులు) పథకాల అమలుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.
ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల జాబితాలను జనవరి 6 (సోమవారం)నగ్రామ, వార్డు సచివాలయల్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు సంబంధించి ఈ నెల 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం 10న జరిగే గ్రామ, వార్డు సభల్లో తుది జాబితాలను ఆమోదిస్తారు. అర్హత సాధించని వారి వివరాలు.. అందుకుగల కారణాలను కూడా ప్రదర్శిస్తారు. కాగా, సోమవారం ప్రకటించిన జాబితాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద మొత్తం 10,65,357 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.

జిల్లాల వారీగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల సంఖ్య..

జిల్లా

అర్హుల సంఖ్య

తూ.గో

1,07,238

గుంటూరు

93,738

చిత్తూరు

91,811

కృష్ణా

91,263

అనంతపురం

89,145

విశాఖపట్టణం

88,503

కర్నూలు

84,116

ప.గో

77,914

ప్రకాశం

77,165

వైఎస్సార్ కడప

76,754

నెల్లూరు

66,492

శ్రీకాకుళం

64,834

విజయనగరం

56,384

మొత్తం

10,65,357

Published date : 07 Jan 2020 02:11PM

Photo Stories